
హైదరాబాద్ మహా నగరంలో ఆస్తిపన్ను బకాయిలు 9,000 కోట్ల రూపాయల మేర పేరుకుపోయిన నేపథ్యంలో బల్దియా ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం అందుతోంది. రాష్ట్రంలో ఉన్న మెజారిటీ సబ్ రిజిస్ట్రార్లు తాము చట్ట ప్రకారం పత్రాలను పరిశీలిస్తామని వెల్లడించారు. రూల్స్ విరుద్ధంగా ఆస్తి పన్ను బకాయిలను ముడిపెట్టి రిజిస్ట్రేషన్లను నిలిపివేయడం సాధ్యం కాదని చట్ట సవరణ ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆస్తి పన్ను పరిధిలో 23 లక్షల కుటుంబాలు ఉండగా ఏకంగా 5 లక్షల భవనాలు సరిగ్గా పన్నులు చెల్లించడం లేదు. 15 ఏళ్ల నుంచి పన్ను చెల్లించని నిర్మాణాల సంఖ్య 5,000 వరకు ఉండగా ఇందులో మెజారిటీ భవనాలు వాణిజ్య భవనాలు అని సమాచారం అందుతోంది. పన్ను బకాయిలు ఉన్న 25 నిర్మాణాల జాబితాను ఆయా జోనల్ కమిషనర్లకు పంపించి చర్యలు తీసుకోవాలని చెప్పుకొచ్చారు.
ఇంటి నంబర్ లేదా ప్రాపర్టీ టాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ ను పొందుపరచడం ద్వారా పన్ను బకాయి కంప్యూటర్ లో ప్రత్యక్షం అవుతుందని చెప్పవచ్చు. బకాయి ఉంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగదు. బెంగళూరు నగర పాలక సంస్థ ఇంటి విస్తీర్ణం ఆధారంగా ఆస్తి పన్నులో చెత్త పన్నును జమ చేస్తుండటం గమనార్హం. ఈ నిర్ణయం విషయంలో ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే ఈ నిర్ణయం అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.