
ఇంతకీ ఈ డౌట్ ఎందుకు వచ్చింది అంటే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన కామెంట్లే కారణం. ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు ఇలాంటి సభలు, సమావేశాలంటే వందకు 90 శాతం ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ పరిస్థితి వేరు కదా. ఆయనకు చాలా పనులుంటాయి, వ్యాపారాలుంటాయి. అయినా రేపు జరిగే ఎమ్మెల్యేల ఫోటో సెషన్ చాలా కీలకం. ఈ ఫోటోలో చంద్రబాబు గారు ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ కూడా వస్తేనే ఆ ఫోటోకి ఒక నిండుదనం, ఒక కళ వస్తుంది అంటూ రఘురామ కృష్ణరాజు పరోక్షంగా పవన్ రావట్లేదేమో అని అనుమానం వ్యక్తం చేశారు.
అయితే రఘురామ కృష్ణరాజు పవన్ కళ్యాణ్ మీద అభిమానంతోనే ఈ కామెంట్స్ చేశారు. పవన్ వస్తే ఫోటో బాగుంటుందని ఆయన ఫీలింగ్. కానీ ఆయన రావట్లేదని ఒక టాక్ నడుస్తుంది. మొత్తానికి రఘురామ కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్ ఈ ఫోటో సెషన్ కు వస్తారా రారా అనేది చూడాలి మరి.
రాజకీయ వర్గాల్లో మాత్రం దీనిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ ఫోటో సెషన్ ఒక చిన్న ఈవెంట్ అయినా, పవన్ కళ్యాణ్ హాజరవుతారా లేదా అనే దానిపై ఇంత చర్చ జరగడం చూస్తుంటే, ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ స్థానం ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు పవన్ చేగువేరా లాంటి భావజాలాలతో రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు సనాతన ధర్మము, హిందూ మతం అంటూ నిలకడ లేని మనిషిలాగా ప్రవర్తిస్తున్నారని షర్మిల విమర్శిస్తున్నారు.