
విజయవాడ ధర్నా చౌక వద్ద నిన్నటి రోజు నిర్వహించిన ఈ ధర్నాలో వాలంటరీలు సైతం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు పైన అటు పవన్ కళ్యాణ్ పైన విరుచుకుపడుతున్నారు. కూటమి ప్రభుత్వం నమ్మి నట్టేట మోసం చేశారని కూడా నిలదీస్తున్నారు. వాలంటరీల వ్యవస్థను కొనసాగించి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని హెచ్చరిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2.60 లక్షల మంది వాలంటరీలు రోడ్డున పడ్డారని ఎన్నికల సమయంలో 10000 జీతం ఇస్తానంటూ మోసం చేశారని ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం అడిగితే వాలంటరీ వ్యవస్థ లేదంటూ గత ప్రభుత్వం మీద విమర్శిస్తున్నారని పైరవుతున్నారు.
నిరుద్యోగ వ్యవస్థను నిర్మూలిస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఉద్యోగులనే పీకేస్తున్నారని ఉపాధి లేకుండా చేస్తున్నారంటే చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు 9 నెలలు పైగా అవుతూ ఉన్న బకాయిలు చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. గతంలో వాలంటరీలు రాజీనామా చేసిన వారిని తీసుకుంటామంటూ హామీ ఇచ్చినప్పటికీ ఇప్పుడు కూటమి సర్కార్ గాలికి వదిలేసింది అంటూ ఫైర్ అవుతున్నారు. మొత్తానికి వాలంటరీ వ్యవస్థ చుక్కలు చూపించేలా చేస్తున్నారని మొదటి దెబ్బ ఇప్పుడు మొదలైందని రాబోయే రోజుల్లో మరిన్ని ఆందోళనలు చాలామంది నిరుద్యోగులు ఉద్యోగస్తులు ప్రజలు కూడా చేపడతారని పలువురు నేతలు తెలియజేస్తూ ఉన్నారు.