
కానీ ఈసారి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా విద్యార్థులు హాల్ టికెట్ వారి ఇంటికి వాట్సాప్ లో తీసుకునేలా గవర్నమెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది . విద్యార్థులకు తల్లిదండ్రులకు ప్రభుత్వం గట్టి రిలీఫ్ ని ఇచ్చింది. ఇలా ఇప్పుడు 10 వ తరగతి పరీక్షల్లో విద్యార్థులకు ఎటు వంటి ఇబ్బందులు రాకుండా అధికారులు ఇప్పటికే ముందస్తు చర్యలు తీసుకున్నారు . ప్రస్తుతం ఎండలు తీవ్రత పెరిగిపోవడం తో పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్నీ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు . ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పదోతరగతి పరీక్షలు రాయిస్తున్న విద్యార్థులకు కీలక సూచనలు ఇచ్చారు ..
మరోవైపు పదో తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారందరికీ పరీక్షలు అయ్యేంత వరకూ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఎక్కువ మంది విద్యార్థులు పల్లె ప్రాంతాల నుంచి పట్టణాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు అనుగుణంగా బస్సులు నడపనున్నట్లు ఇప్పటికే ఏపీఎస్ ఆర్టీసీ సైతం ప్రకటించింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో హాల్ టికెట్ చూపించి విద్యార్థులు ఉచితంగా బస్సు ఎక్కొచ్చని అధికారులు వెల్లడించారు. ఇలా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఎన్నో సంచల నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి పెట్టారు .