ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు తన పొలిటికల్ కెరీర్ లో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. 2004, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి నేనే కారణం అంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 2004, 2019లో అధికారంలో ఉండి టీడీపీ ఎన్నికలకు వెళ్లిందని బాబు తెలిపారు.
 
ఆ రెండు ఎన్నికల సమయంలో తాను వర్క్ లో బిజీగా ఉండి పార్టీని, ఎమ్మెల్యేలను సమన్వయం చేసే విషయంలో ఫెయిల్ అయ్యానని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ఆ సమయంలో తాను చేయాల్సిన కొన్ని పనులు సైతం చేయలేకపోయనని చంద్రబాబు నాయుడు కామెంట్లు చేశారు. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తే అపజయం అనేది ఎప్పుడూ ఉండదని ఆయన పేర్కొన్నారు.
 
చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ సమయంలో ప్రజల్లో టీడీపీపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉండేది. చంద్రబాబు నాయుడు పార్టీని 2029లో సైతం గెలిపించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. 1999 మ్యాజిక్ ను 2029లో రిపీట్ చేయాలని చంద్రబాబు నాయుడు భావిస్తుండటం గమనార్హం.
 
సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చిన హామీలను సైతం కూటమి సర్కార్ ఒక్కొక్కొటిగా అమలు చేయనుందని సమాచారం అందుతోంది. పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా కూటమి సర్కార్ నిర్ణయాలు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. చంద్రబాబు నాయుడు భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు ప్రశంసలు అందుకుంటూ తన పాలనతో ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు. ఏడు పదుల వయసులో కూడా ఈ స్థాయిలో కష్టపడటం చంద్రబాబు నాయుడుకు సాధ్యమవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు తన పాలనతో ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.






 


మరింత సమాచారం తెలుసుకోండి: