గత ఏడాది సార్వత్రిక ఎన్నికలలో వైసిపి పార్టీ ఘోరంగా ఓడిపోయిందని. కేవలం 11 స్థానాలకే పరిమితం అవ్వడంతో చాలామంది నేతలతో పాటు పలువురు నాయకులు కూడా ఎద్దేవ చేయడం జరిగింది. కానీ రాను రాను ఏపీలో వైసిపి అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి లోని లోటు చాలా క్లియర్ గా కనిపిస్తోంది అంటు ప్రజలు మాట్లాడుకుంటున్నారట. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కనిపించినా కూడా భారీ ఎత్తున ప్రజలు వస్తున్నారు. ముఖ్యంగా అధికార నేతలు నాయకులు ఉన్నప్పటికీ కూడా అంతకంటే ఎక్కువ జనం జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వస్తూ ఉండడం గమనార్హం.


చాలామంది వైసిపి పార్టీ ఓడిపోవడంతో పార్టీ పని అయిపోయిందని ఇతర పార్టీలలో కూడా వైసీపీ నుంచి వెళ్తున్నారు అయితే ఇలాంటి సమయంలోనే అనూహ్యంగా కొన్ని కొన్ని సందర్భాలలో జనాలలోకి జగన్ మోహన్ రెడ్డి వెళ్లడం మొదలుపెట్టారు. దీంతో ఆయన వెంట అభిమానం భారీగా పోటెత్తుతూ ఉన్నది. దీంతో ఏపీ అంతట మరొక సరికొత్త చర్చకు దారి తీసేలా కనిపిస్తోంది. ముఖ్యంగా వైసిపి ప్రభుత్వానికి వచ్చిన 40 శాతం ఓటు బ్యాంకు ను కూడా చాలామంది నేతలకు గుర్తుచేసేలా కనిపిస్తోంది.


తాజాగా వీడియో వైరల్ గా మారడంతో అక్కడికి వచ్చిన జనసంద్రన్ని చూసి చాలామంది మళ్లీ మొదటినుంచి మొదలుపెట్టాలంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు.. మరి కొంతమంది మాత్రం జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేసిన వారందరికీ  సరైన సమాధానం ఈ వీడియోనే అంటూ కామెంట్స్ చేయగా మరికొంతమంది మాత్రం జగన్ అభిమానం ఏమాత్రం చెక్కుచెదరలేదు అంటూ అందుకు నిదర్శనం తెనాలిలో కనిపించిన ఈ దృశ్యాలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే తెనాలి మాజీ ఎమ్మెల్యే అనాబత్తుని శివకుమార్ కుమారుడు యొక్క వివాహ రిసెప్షన్ కి సైతం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.  పెద్ద ఎత్తున ప్రజలు జై జగన్ అంటూ నినాదాలను పోరెత్తించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: