
వాస్తవానికి రాజకీయాల్లో ఉన్న నాయకులు.. సమయానికి తగు విధంగా మాట్లాడతారు. అంటే.. ఇప్పుడు తీసుకున్న సబ్జక్టు.. రేపు ఉంటుందన్న గ్యారెంటీ ఏమీ ఉండదు. ఎప్పటికప్పుడు సబ్జక్టు అనేక రూపాలు సంతరించుకుంటుంది. కానీ, పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను మాత్రం చాలా రాజకీయ నేతలే ట్రోల్స్ చేస్తున్నారు. అయితే.. ఇటా ట్రోల్ చేస్తున్నది ఎవరనే విషయంపై పవన్ కల్యాణ్‌కు సమాచారం అందిం ది. దీనినే చంద్రబాబు కు ఆయన నివేదించారని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.
ప్రధానంగా ఓ వర్గం తమ్ముళ్లు.. పవన్ను టార్గెట్ చేస్తున్నారన్న విషయం చంద్రబాబు కూడా సమాచారం ఉంది. దీంతో వారిని పరోక్షంగా ఆయన హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే.. వారు తమ తమ ఎకౌంట్ల నుం చి కాకుండా.. పరోక్షంగా పవన్‌పై విరుచుకుపడేలా వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నారు. దీనినే పవన్ కల్యాణ్.. చంద్రబాబుకు చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలో వారి పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసి.. తాను చూసుకుంటానని పేర్కొనట్టు సమాచారం.
ఇక, మంత్రివర్గంలో మార్పులపైనా.. అధికారుల పనితీరుపైనా కూడా.. చర్చ జరిగినట్టు తెలిసింది. పం చాయతీరాజ్ శాఖకు చెందిన కొందరు ఉద్యోగులు.. తన మాటను కూడా వినిపించుకోవడం లేదని.. పవన్ కల్యాణ్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆయా విషయాలను కూడా చంద్రబాబు చెవిన వేసినట్టు తెలిసింది. ఇక, కూటమి పార్టీల మధ్య జరుగుతున్న కొన్ని లోపాలను కూడా ప్రస్తావించారు. వీటిని ఇప్పుడే కలిసి పరిష్కరించుకునే ప్రయత్నాలు చేయాలని ఇరువురు నాయకులు నిర్ణయించినట్టు సమాచారం.