కూటమి ప్రభుత్వం ఇటీవలే  వైయస్సార్ జిల్లాను వైయస్సార్ కడప జిల్లాగా పేరు మార్చడంతో ఈ విషయం పైన PCC చీఫ్ షర్మిల ఫైర్ కావడం జరిగింది. అంతేకాకుండా గత వైసిపి ప్రభుత్వంలో పేరు మార్చిన వాటిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం మార్చడంతో షర్మిల విమర్శలు చేస్తోంది.. ఆనాడు జగన్ చేసిన తప్పే మళ్ళీ మీరు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.. అధికారంలో ఉన్నప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్ పేరుని మార్చి వైసిపి ప్రభుత్వం అభిమానుల మనోభావాలను కూడా దెబ్బతీసేలా చేశారని.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా వైయస్సార్ పేరుని మార్చి ప్రతికారం తీర్చుకుంటున్నారంటూ ఫైర్ అయ్యింది.


వైయస్సార్ జిల్లాను తిరిగి వైయస్సార్ కడప జిల్లాగా మీరు సవరించడంలో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా కూడా కృష్ణాజిల్లా తాడిగడప మున్సిపాలిటీకి వైయస్సార్ పేరుని సైతం తీసివేయడం ఖండించినట్లు తెలియజేసింది షర్మిల.. వైయస్సార్ అంటే ఎందుకు మీకు అంత కక్ష.. చంద్రబాబు అంటు షర్మిల ప్రశ్నించడం జరిగింది.. వైయస్సార్ జిల్లాను తిరిగి కడప పేరు చేర్చినప్పుడు మరి విజయవాడ కేంద్రంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లాకు ఎన్టీఆర్ విజయవాడో లేకపోతే పాత కృష్ణాజిల్లాలకు ఎన్టీఆర్ కృష్ణ జిల్లాగా ఎందుకు పేరు మార్చలేదంటూ షర్మిల ప్రశ్నించడం జరిగింది.



వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలోనే ఎన్నో సంక్షేమ పథకాలకు మూల కారకుడు అయ్యారు.. ప్రజల గుండెలను చిరస్థాయిగా నిలిచిపోయే ఒక మహానేతగా మిగిలారు.. ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్, జలయజ్ఞం, ఉచిత విద్యుత్ వంటి ఎన్నో పథకాలను ఆ మహానేత వైఎస్సార్ అమలు చేసి తెలుగువారి గుండెల్లో నిలిచిపోయిన గొప్ప నేతకు రాజకీయాలు ఆపాదించడం సరైనది కాదు అంటూ తెలియజేసింది. ఇది ఆయనకు ఇచ్చేటువంటి గౌరవం కాదంటారా.. వైయస్సార్ పేరు అంటే ప్రజల ఆస్తి అని ఏ ఒక్కరి సొత్తు కాదు అంటు షర్మిల ఫైర్ కావడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: