
తెలంగాణ అసెంబ్లీ మొత్తం కెసిఆర్ జపం చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పర్యాటకశాఖ పైన... కీలక చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే... యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం గురించి అసెంబ్లీలో చర్చకు వచ్చింది. అయితే ఈ దేవాలయాన్ని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు... పునర్నిర్మించారు. దాదాపు 1600 కోట్లకు పైగా ఈ దేవాలయం నిర్మించేందుకు ఖర్చు అయినట్లు సమాచారం.
ఇక ఇప్పుడు... యాదాద్రి దేవాలయం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఏడాది 200 కోట్ల ఆదాయం వస్తుందని.. తాజాగా స్వయంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఆమె చెప్పకనే చెప్పారు. అదే సమయంలో... ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... యాదాద్రి దేవాలయంపై ప్రశంసలు కురిపించారు. భగవంతుడి కారణంగా... కెసిఆర్ యాదాద్రి దేవాలయాన్ని నిర్మించాడని.. ఈ విషయంలో ఆయనను మెచ్చుకోవాలని కొనియాడారు.
యాదాద్రి దేవాలయం పునర్నిర్మాణం విషయంలో రాజకీయాలు వద్దని... తిరుమల శ్రీవారి సన్నిధి తరహాలో ఇక్కడ దేవాలయాన్ని నిర్మించిన కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇక ఇటు మండలిలో... గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా.. కెసిఆర్ పాలనను గుర్తుకు చేసుకున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాదాద్రి దేవాలయం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు.
అప్పుడు... ప్రతి విషయంలో ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలను యాదాద్రి కి తీసుకువెళ్లి... అక్కడి విషయాలను కేసీఆర్ స్వయంగా వివరించేవారని గుత్తా సుఖేందర్ పేర్కొన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాదాద్రిలో ఏ చిన్న కార్యక్రమం జరిగిన... తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఆహ్వానం అందలేదని వెల్లడించారు. కానీ ఇప్పుడు యాదాద్రి దేవాలయ కమిటీ సభ్యులు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. అయితే ఈ విషయాన్ని దేవదాయ శాఖ మంత్రి కొండా.. సురేఖ గుర్తించారు. ఇలాంటి సమస్యలు మరోసారి రాకుండా చూసుకుంటామని మండలి వేదికగా ప్రకటించారు.