ఆంధ్రప్రదేశ్లో కూటమి నుంచి మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది.. ఆ మేనిఫెస్టో ఆధారంగా అందులో సూపర్ సిక్స్ హామీలతో పాటుగా రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలకు సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామంటూ మేనిఫెస్టోలో ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క హామీను అమలు చేస్తామంటూ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికలలో భాగంగా 50 ఏళ్లకే సామాజిక భద్రత పింఛన్ ఇస్తామంటూ టిడిపి కూటమి హామీ ఇచ్చింది.. అయితే ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికి 50 వేలకు 4000 పింఛన్ అందిస్తామంటూ టిడిపి అధినేత చంద్రబాబు అప్పట్లో ఎన్నికల ముందు మాట ఇచ్చారు.


ఏపీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో అటు శాసనమండలి సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఈ సభకు వైసీపీ ఎమ్మెల్యేలు రాకపోవడంతో పెద్దగా సభ గురించి ఎవరూ పట్టించుకోలేదు.. కానీ మండలిలో మాత్రం వైసిపి మెజారిటీ ఉండడంతో చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోని 50 ఏళ్లకు పెంచి హామీ ఏమయిందని.. ఎప్పుడు అమలు చేస్తారంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది పింఛను తీసేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారని ప్రశ్నించగా.. ఇందుకు సమాధానంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానాన్ని తెలిపారు.


50 ఏళ్లకే పింఛన్ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి.. 2014లో 1000 రూపాయలుగా ఉన్న పించినేనే 2000 చేసామని వృద్ధాప్య పింఛనులతో పాటు చాలామందికి అందించామని.. గత వైసిపి ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్లు పట్టిందంటూ ఎద్దేవ చేశారు..50 ఏళ్లకే పింఛన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలలో అర్హులైన వారికి అందించేందుకే ప్రణాళికలు చేపడుతున్నామంటూ తెలిపారు.. అయితే ఈ విషయం విన్న అగ్రవర్ణ పేదలు  విరుచుకుపడుతున్నారు.. కేవలం వారు మాత్రమే ఓటు వేశారా అందరూ వేశారు కదా? అప్పుడు అందరికీ సమానంగానే పించిని అందించేలా చూడాలంటు.. అలాగే అగ్రవర్ణాలలో కూడా పేదలు ఉన్నారని గుర్తించాలని తెలుపుతున్నారు..మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: