ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ వినియోగం సర్వ సాధారణం అయిపోయింది. అయితే గ్యాస్ సిలిండర్ ను కొనుగోలు చేసేవాళ్లు చిన్నచిన్న తప్పులు చేయడం వల్ల దీర్ఘకాలంలో ఊహించని స్థాయిలో నష్టం కలుగుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. రూల్స్ ప్రకారం ప్రతి వినియోగదారుడికి ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లు రాయితీపై అందుతున్నాయి.
 
అవసరాలకు అనుగుణంగా కుటుంబాలు ఈ గ్యాస్ సిలిండర్లను వినియోగించడం జరుగుతుంది. కొంతమంది ఎక్కువ సంఖ్యలో గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తుంటే మరి కొందరు మాత్రం పరిమితంగానే గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నారు. అయితే కొన్ని గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్లను అక్రమంగా బ్లాక్ మార్కెట్ ను తరలించి సొమ్ము చేసుకుంటూ ఉండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
 
వాస్తవానికి గ్యాస్ సంస్థలు మనకు ఇచ్చే బిల్లులో సిలిండర్ల సంఖ్య లేదా సిలిండర్ల బరువు ఆధారంగా ఈ వివరాలను మనకు తెలిసేలా చేస్తాయి. ఈ మధ్య కాలంలో కొంతమందికి గ్యాస్ బుకింగ్ చేయకుండానే మొబైల్ ఫోన్లకు మెసేజ్ లు వస్తున్నాయి. డెలివరీ బాయ్స్ ఏజెన్సీలతో కుమ్మక్కై ఈ తరహా మోసాలకు తెర లేపుతున్నారని సమచారం అందుతోంది.
 
మీకు కూడా ఈ తరహా మోసాలు జరిగితే సమీపంలోని గ్యాస్ ఏజెన్సీ లేదా కస్టమర్ కేర్ నంబర్లను సంప్రదించడం ద్వారా ఈ తరహా మోసాల బారిన పడకుండా రక్షించుకునే అవకాశాలు ఉంటాయి. గ్యాస్ సిలిండర్ వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ తరహా మోసాలు జరగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. గ్యాస్ సిలిండర్ వినియోగదారులు పొరపాట్లు చేస్తే తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పడంలో సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ సిలిండర్ యూజర్లకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో ప్రయోజనాలు, లాభాలను అందిస్తుండటం గమనార్హం.






మరింత సమాచారం తెలుసుకోండి: