
విశాఖపట్నం ఐటీ పార్క్‌లో జరుగుతున్న అభివృద్ధి చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఏకంగా 54 కంపెనీలకు 295 ఎకరాలు కేటాయించారంటే మామూలు విషయం కాదు. అందులో 41 కంపెనీలు ఇప్పటికే కార్యకలాపాలు మొదలుపెట్టేశాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, అతి త్వరలోనే అసలు సిసలైన ఐటీ విప్లవం చూడబోతున్నామని లోకేష్ ధీమాగా చెబుతున్నారు.
ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే, టాప్ 100 డెవలపర్స్, బిగ్ షాట్ ఐటీ కంపెనీలు, ఫార్చూన్ 2500 లిస్టులో ఉండే కార్పొరేట్ దిగ్గజాలతో నారా లోకేష్ టీమ్ మంతనాలు జరుపుతోందట. రాబోయే రోజుల్లో ఒక్కొక్కటిగా సంచలన ప్రకటనలు రాబోతున్నాయని సమాచారం. ఐటీ రంగంలో ఏపీ దూకుడు ముందు ముందు ఎలా ఉండబోతుందో ఊహించుకుంటేనే గూస్‌బంప్స్ వస్తున్నాయి.
భూముల కేటాయింపు విషయంలో గతంలో ఉన్న నిబంధనలకు స్వస్తి పలికి.. కంపెనీలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారట. టీసీఎస్, కాగ్నిజెంట్, విప్రో, ఇన్ఫోసిస్, డెలాయిట్ లాంటి సంస్థలకు ఒకలా.. ఇంటిగ్రేటెడ్ యాక్టివిటీస్, ఫుడ్ కోర్ట్స్, బేసిక్ రిటైలింగ్ యాక్టివిటీస్ చేసే కంపెనీలకు మరోలా భూములు కేటాయిస్తామని చెప్పడం విశేషం. అంటే ప్రతి రకమైన కంపెనీకి ఏపీలో చోటు ఉంటుందని భరోసా ఇస్తున్నారు.
మొత్తానికి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ రంగంలో నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడానికి ఫుల్ ఫోకస్‌డ్‌గా ఉన్నారని అర్థమవుతోంది. మరి, లోకేష్ వేస్తున్న ఈ మాస్టర్ ప్లాన్స్ ఎంతవరకు వర్కవుట్ అవుతాయో, ఏపీ ఐటీ రంగానికి ఎంత ఊపునిస్తాయో చూడాలి. వర్కౌట్ అయితే మాత్రం లోకేష్ పేరు ఏపీ ఐటీ చరిత్రలో చెరగని ముద్రగా నిలిచిపోతుంది.