ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలోని మహానంది క్షేత్రం ఉన్నది.. ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉన్నది.. అయితే తాజాగా మహానంది క్షేత్రంలో విషాద ఘటన చోటు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. పాతికేళ్ల నాటి నాగనంది సదనం కూల్చివేత చేస్తున్న సందర్భంలో గాయపడిన ఇద్దరు కార్మికులను మృత్యువాత పడ్డారట.. అసలు విషయంలోకి వెళ్తే మహానంది క్షేత్రంలో గాజుల పల్లె టోల్గేట్ వద్ద ఉండేటువంటి నాగనంది సదనం భక్తుల కోసం కొన్ని వసతి గృహాలను ఆలయ అధికారులు అప్పట్లోనే నిర్మించారట.


కానీ గదులు శిథిలం అయిపోవడంతో 50 గదులు సరికొత్త హంగులతో నిర్మించాలని అధికారులు చేపట్టారు. అయితే ఇందులో భాగంగా నాగనంది సదనాన్ని కూల్చివేతకు ఆలయ అధికారులు చేపట్టారు.. దీంతో అక్కడికి పనికి వచ్చిన రాము, బండి ఆత్మకూరు మండలానికి చెందిన వెంకటేశ్వర్లు అక్కడ పనిచేస్తూ ఉండగా పైకప్పు నుండి శిథిలాలు పెద్ద శబ్దంతో వీరి మీద పడ్డాయట. వెంటనే అక్కడ పనిచేస్తున్న కూలీలు వీరిద్దరిని గమనించి శిథిలాలను తొలగించారు.


అయితే అప్పటికే రాము మృతి చెందగా ఈ ఘటనలతో తీవ్రమైన గాయాలు పొందిన వెంకటేశ్వర్ల ను దగ్గరలో ఉండే హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు..  వీరిద్దరూ కూడా నంద్యాల ప్రాంతానికి చెందిన వారే నట.దీంతో మహానంది క్షేత్రంలో ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొన్నాయి..  వీరిద్దరి మృతి పైన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సంతాపాన్ని తెలియజేస్తూ ఈ మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ హామీ ఇవ్వడం జరిగింది. మొత్తానికి మహానంది ప్రాంతంలో  ఈ విషాద ఛాయలు నిలవకొనడంతో భక్తులు కొంతమేరకు ఆగ్రహాన్ని తెలియజేస్తున్నట్లు తెలుస్తోంది.. మరి ఇక మీదటనైన అధికారులు జాగ్రత్తగా ఇలాంటి పనులు చేసేటప్పుడు అన్ని విధాలుగా దగ్గరుండి మరి చూసుకొని ఇలాంటివి జరగకుండా చూడాలని అక్కడి భక్తులతో పాటు కార్మికులు కూడా తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: