
• బడ్జెట్ సైజ్ చూస్తే..
వచ్చే ఏడాదికి ఏకంగా రూ.3,04,965 కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో రెవెన్యూ ఖర్చు రూ. 2,26,982 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా ఉంది. ఈ బడ్జెట్ కేటాయింపులు చూస్తే.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై ఎంత ఫోకస్ పెట్టిందో అర్థమవుతోంది.
• విద్యారంగానికి భారీ బొనాంజా:
విద్యారంగానికి ఈ బడ్జెట్‌లో భారీగా నిధులు కుమ్మరించారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం విశేషం. పేద విద్యార్థులు ఐఐటీ-జేఈఈ, నీట్ లాంటి ప్రతిష్ఠాత్మక పరీక్షల్లో సత్తా చాటేందుకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. అంతేకాదు, రాష్ట్రంలో కొత్తగా 16 నర్సింగ్ కాలేజీలు, 28 హెల్త్ సైన్స్ కాలేజీలు రాబోతున్నాయి. దీంతో తెలంగాణలో వైద్య విద్యకు మరింత ఊతం లభించనుంది.
• రైతులకు పండగే పండగ:
వ్యవసాయ రంగం తెలంగాణకు వెన్నెముక. దీన్ని గుర్తించిన ప్రభుత్వం.. రైతులకు మరింత ఊరట కల్పించేలా బడ్జెట్ కేటాయింపులు చేసింది. రైతులకు సబ్సిడీలు, ఉచిత విద్యుత్ పథకాలు యథావిధిగా కొనసాగించనున్నారు. కొత్త సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించడంతో.. వ్యవసాయం మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది.
• టూరిజంకు కొత్త ఊపు:
తెలంగాణ పర్యాటక రంగాన్ని వరల్డ్ మ్యాప్‌లో నిలబెట్టేందుకు ప్రభుత్వం గట్టిగా ఫిక్సయింది. పర్యాటక రంగాన్ని 10 శాతం వరకు పెంచాలనే లక్ష్యంతో కొత్త టూరిజం పాలసీ తీసుకురానున్నారు. దీని ద్వారా రూ. 15,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. తెలంగాణ అందాలను చూసేందుకు దేశ విదేశీ టూరిస్టులు క్యూ కట్టే రోజులు ఎంతో దూరంలో లేవు.
• మౌలిక సదుపాయాలకు పెద్ద పీట:
రోడ్లు, భవనాల అభివృద్ధికి రూ. 5,907 కోట్లు, మునిసిపల్ డెవలప్‌మెంట్ కోసం రూ.17,677 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడితే.. అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
• మహిళా సాధికారతకు ప్రత్యేక ఫోకస్
మహిళా సాధికారత లేకుండా రాష్ట్రం అభివృద్ధి చెందడం అసాధ్యం. అందుకే మహిళల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టారు. మహిళా స్వయం సహాయ సమితులకు ఆర్థిక సాయం అందించనున్నారు. మొత్తానికి ఈ బడ్జెట్ మహిళా లోకానికి పండగ చేసుకునేలా ఉంది.