పాకిస్థాన్ గురించే తలుచుకుంటేనే భారత్‌లో ప్రతి ఒక్కరికీ కోపం నషాళానికి ఎక్కుతుంది. ఎందుకంటే, ఇన్నాళ్లూ మనల్ని తెగ ఇబ్బంది పెట్టింది ఆ దేశం. కానీ ఇప్పుడు మోదీ సర్కార్ గట్టిగా దెబ్బ కొట్టడంతో పాక్ విలవిల్లాడుతోంది. "టేబుల్ మారింది.. వడ్డించేవాడు మారాడు అంతే" అని పాతసారథి పొట్టూరు చెప్పినట్టు.. ఇప్పుడు పాక్ పరిస్థితి అచ్చం అలాగే ఉంది.

2014 వరకు కశ్మీర్ విషయంలో పాకిస్తానే మనకు సమస్యలు సృష్టించింది. కానీ 2017 నుంచి మనమే పాకిస్తాన్‌కు సమస్యలు వడ్డిస్తున్నాం. బలూచిస్తాన్‌లో జరుగుతున్న దాడులు చూస్తే ఇదే అనిపిస్తుంది. ఆదివారం బలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్థాన్ సైనికుల కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి చేసి ఏకంగా 90 మంది సైనికుల్ని మట్టుబెట్టింది.

మొత్తం ఎనిమిది బస్సుల్లో సైనికులు తఫ్తాన్‌కు వెళ్తుండగా ఈ దాడి జరిగింది. నోష్కి ప్రాంతం దగ్గర రోడ్డు పక్కన పార్క్ చేసిన కారు ఒక్కసారిగా బస్సుపైకి దూసుకొచ్చి పేలిపోయింది. ఆ బస్సులో ఉన్న పాకిస్థాన్ ఫ్రాంటియర్ ఫోర్స్‌కు చెందిన సైనికులంతా అక్కడికక్కడే చనిపోయారు.

BLA ఈ దాడిని పక్కాగా ప్లాన్ చేసింది. వాస్తవానికి BLAలో రెండు విభాగాలు ఉన్నాయి. ఒకటి మజీద్ బ్రిగేడ్. ఇది ఫిదాయి దాడులు చేసే ఆత్మాహుతి దళం. బలూచిస్తాన్ కోసం ప్రాణాలు ఇచ్చే యువకులతో ఈ బ్రిగేడ్ ఉంటుంది. నిన్నటి దాడి చేసింది ఈ మజీద్ బ్రిగేడ్ సభ్యులే. కార్లో పేలుడు పదార్థాలు నింపి, బస్సు దగ్గరికి రాగానే దాన్ని ఢీకొట్టి పేల్చేశారు. బస్సు పేలిపోగానే వెనకాల వస్తున్న బస్సులపై ఫతే స్క్వాడ్ కాల్పులు జరిపింది.

వాళ్ల చేతిలో ఉన్న M4 అసాల్ట్ రైఫిల్స్‌తో సైనికులను చంపేశారు. ఈ M4 రైఫిల్స్ అమెరికా సైన్యం 2020లో కాబుల్ ఎయిర్‌బేస్‌లో వదిలి వెళ్లినవి. ట్రంప్ మా ఆయుధాలు మాకు ఇచ్చేయండి అని గట్టిగానే డిమాండ్ చేశారు. కానీ అమెరికా మాత్రం నర్మగర్భంగా "మేం చెప్పిన వాళ్లకి ఇవ్వండి" అని సింపుల్‌గా చెప్పేసింది.

నిన్నటి దాడి చూస్తే ఇరాక్‌లో ఐసిస్ టెర్రరిస్టులు అమెరికన్ సైన్యంపై చేసిన దాడులు గుర్తుకు వస్తున్నాయి. అప్పట్లో ఐసిస్ టెర్రరిస్టులు చిన్న కార్లలో వచ్చి యుద్ధ ట్యాంకులను ఢీకొట్టి పేల్చేసేవాళ్లు. వెంటనే మరో గ్రూప్ వెనకున్న ట్యాంక్‌పై గ్రెనేడ్స్‌తో దాడి చేసి సపోర్ట్ రాకుండా చేసేవాళ్లు. ముఖాముఖి పోర్ల కంటే ఇలాంటి గెరిల్లా ఫైట్స్‌లోనే ఎక్కువ మంది అమెరికన్ సైనికులు చనిపోయారు. నిన్నటి BLA దాడి కూడా అచ్చం ఇరాక్‌లో జరిగిన దాడిలాగే ఉంది.

మరోవైపు పాకిస్థాన్ ఆర్మీ ప్లాన్ లీక్ అయింది. ఎనిమిది బస్సుల్లో ఫ్రాంటియర్ ఫోర్స్‌ను తఫ్తాన్‌కు ఎందుకు తరలిస్తున్నారనేది BLAకి తెలిసిపోయింది. తఫ్తాన్ అనేది పాకిస్తాన్-ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న పట్టణం. బలూచిస్తాన్ నుంచి BLA ఫైటర్లను తరిమి తరిమి.. తఫ్తాన్ దగ్గర నుంచి ఇరాన్‌లోకి పారిపోకుండా చుట్టుముట్టాలని పాక్ ఆర్మీ స్కెచ్ వేసింది. అందుకే ముందుగా 500 మంది సైనికుల్ని తఫ్తాన్‌కు పంపాలని ప్లాన్ చేసింది. మిలిటరీ ట్రక్కుల్లో పంపిస్తే తెలిసిపోతుందని సాధారణ ప్రయాణికుల బస్సుల్లో తరలించింది. కానీ ఎవరో ఈ ప్లాన్‌ను లీక్ చేశారు. BLAకి ప్లాన్ లీక్ కావడంతో హైవేపై కాపు కాసి మరీ దాడి చేసింది.

పాక్ మీడియాకు వీడియో ఇవ్వకుండా భారత్, మధ్యప్రాచ్య మీడియాకు BLA పంపింది. BLA దాడులు ఇరాక్ తరహాలో ఉన్నాయని నిపుణులు అంటున్నారు. డాలర్ల కోసం ఇరాక్ అధికారులు CIAకు సమాచారం అమ్మినట్టు, పాక్ లోనూ లీకులున్నాయి. TTP, raw సహకారం BLAకు ఉందని పాక్ ఆరోపిస్తోంది. రెండు నెలల్లో 219 సైనికులు హతమయ్యారు. ISI అధికారిపై దాడి, ఖైబర్ ఫక్తున్వాలో దాడులు కొనసాగుతున్నాయి. షరియా కోసం ISIS-K బెదిరింపులు, CIA కంట్రోల్ లో ISIS-K ఉందనే ఊహాగానాలు ఉన్నాయి. పాక్ కష్టాల్లో పడింది, మోదీ ప్లాన్ ఏంటో తెలీదు కానీ పాక్ అల్లాడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: