తెలంగాణ బడ్జెట్ ను తాజాగా ప్రవేశ పెట్టారు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడారు. తెలంగాణ బడ్జెట్ రూ.3,04,965 కోట్లుగా ఉందని వెల్లడించారు. రెవెన్యూ వ్యయం రూ. 2,26,982 కోట్లు అని... మూలధన వ్యయం రూ. 36,504 కోట్లుగా ఉందని చెప్పారు. 2025 - 26 బడ్జెట్ కేటాయింపులు రంగాలవారీగా తెలిపారు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 3,79,751 ఉంటుందని తెలిపారు. ప్రపంచంలోనే అత్యాధునిక సౌకర్యాలతో ఫ్యూచర్ సిటీ అని వెల్లడించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం రహదారుల మధ్య 7565 చ.కి.మీ విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.


ప్రాజెక్టు పర్యవేక్షణకు ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క. గ్రీన్ బిల్డింగ్స్, ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, మల్టీమోడల్ కనెక్టివిటీ వంటి ఆధునిక సౌకర్యాలు అందిస్తామన్నారు.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఫార్మా హబ్, క్లీన్ ఎనర్జీ, ఇన్నొవేషన్ జోన్ ఇందులో భాగంగా ఉంటాయని తెలిపారు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క.


తెలంగాణలో శ్రామిక శక్తి 68.7 శాతం ఉండగా దేశంలో శ్రామిక శక్తి 64.3 శాతంగా ఉందని వివరించారు.మహిళల ఉపాధి శాతం  52.7%  ఉండగా దేశంలో  45.2% ఉందని స్పస్టం చేశారు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క. పాఠశాలలకు గ్రీన్ విద్యుత్ ఇస్తున్నామని...  ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్  అంటూ ప్రకటించారు.  విద్యాశాఖకు 23,108 కోట్లు ఈ బడ్జెట్‌లో కేటాయిస్తున్నామన్నారు డిప్యుటీ సీఎం భట్టి.

2023 డిసెంబర్ నుంచి ఆరోగ్య శ్రీకి 1215 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.  ఇది గత సంవత్సరాల కేటాయింపులకంటే 50 శాతం అధికం అన్నారు. ఐటీ కేంద్రంగా వరంగల్ ను తీర్చిదిద్దుతామని...  వరంగల్‌ ను విద్యావైద్య మరియు ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నిజామాబాద్, ఖమ్మంను వ్యవసాయాధారిత పరిశ్రమలు, తయారీ రంగానికి కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని అసెంబ్లీలో ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: