
క్రికెట్లో ఫీల్డింగ్ చేస్తున్నటువంటి విజయ్ కుమార్, సుధీర్ రెడ్డి, రాధాకృష్ణ ఒకసారిగా కింద పడిపోవడంతో వీరికి గాయాలయ్యాయట. కబ్బడి ఆడుతున్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే దగ్గరలో ఉండే ఆసుపత్రికి తీసుకెళ్లి మరి చికిత్స అందించారట. ఆంధ్రాలో గత మూడు రోజుల నుంచి ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు సైతం జరుగుతున్న సంగతి తెలిసిందే ఇది విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్నాయి. ఈ పోటీలలో పాల్గొనేందుకు చాలా మంది నేతలు కూడా చాలా ఉత్సాహం చూపించారు.
మొత్తం 173 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పేర్లను సైతం ఇందులో నమోదు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఆటల పోటీలు ముగింపు సీఎం చంద్రబాబు హాజరు కాబోతున్నారు. విజేతలకు కూడా పలు రకాల బహుమతులు అందించబోతున్నట్లు తెలుస్తోంది. సుమారుగా 12 విభాగాలలో ఈ ఆటల పోటీలు జరగబోతున్నాయి. కొంతమంది రెండు మూడు ఆటలలో కూడా పాల్గొనేందుకు ఇష్టపడుతున్నారట. మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా కొన్ని రకాల ఆటలు ఇందులో నిర్వహించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ముగించడంతో చట్టసభలకు సంబంధించి క్రీడా పోటీలను కూడా ఏపీ ప్రభుత్వం మొదలు పెట్టింది. ఏపీ లేజీస్ లేజర్ స్పోర్ట్స్ మీట్ 2025లో భాగంగా ఈ పోటీలను నిర్వహించినట్లు సమాచారం.. చట్టసభల నుంచి కొంతమేరకు ఒత్తిడి నుంచి బయటపడడానికి ఈ పోటీలను నిర్వహించారట.