
ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో విచ్చలవిడిగా దోపిడీలు, దౌర్జన్యాలు జరుగుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శృతి మించిన 20 మంది ఎమ్మెల్యేల విషయంలో చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉన్నారని సమాచారం అందుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చినా వాళ్ల తీరులో మార్పు రాలేదని తెలుస్తోంది.
రాయలసీమ, ఉత్తరాంధ్ర, గుంటూరు, గోదావరి జిల్లాల్లోని కొందరు నేతల తీరు విషయంలో చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. పోలీసులు, ఇతర అధికారులకు సైతం ఆ నేతలు చెప్పినట్టు వినవద్దని చెప్పినట్టు సమాచారం అందుతోంది. చంద్రబాబు నాయుడు ఒకింత తెలివితేటలతో వ్యవహరిస్తూ ప్రజల మెప్పు పొందే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
కొంతమంది ఎమ్మెల్యేలు బలవంతపు వసూళ్లకు సైతం పాల్పడుతున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో సైతం నిజానిజాలు తెలియాల్సి ఉంది. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టకపోయినా చెడ్డ పేరు మాత్రం తీసుకురాకూడదని భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రజలకు మంచి జరగడానికి ఎక్కువగా ప్రధాన్యత ఇస్తూ ఉండటం గమనార్హం. చంద్రబాబు నాయుడు ఏపీ రాజకీయాలలో విప్లవాత్మక మార్పుల దిశగా అడుగులు వేస్తున్నారని కూడా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడు అని ఇలాంటి నేతలు అరుదుగా ఉంటారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఏడు పదుల వయస్సులో సైతం ప్రజల కోసం ఈ స్థాయిలో కష్టపడటం చంద్రబాబు నాయుడుకు మాత్రమే సాధ్యమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.