సినీ నటుడు పోసాని కృష్ణ మురళి గతంలో ప్రతిపక్ష పార్టీ నాయకుల పై నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. రాయలేని పదజాలంతో ఆయన రెచ్చిపోయారు. ఇప్పుడు అదే అతని మెడకు ఉరిలా బిగుసుకు పోతోంది. ప్రస్తుతం ఈ సినిమా యాక్టర్ కం రచయిత భవితవ్యంపై ఉత్కంఠ రేగింది. ఆయన బెయిల్ పిటిషన్‌పై సిఐడి కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ఎల్లుండికి వాయిదా వేయడంతో పోసాని బయటకు వస్తారా లేదా జైలులోనే ఉంటారా అనే ఉత్కంఠ నెలకొంది.

చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసుల్లో పోసాని చిక్కుల్లో పడ్డారు. ఇదివరకే గుంటూరులో నమోదైన సిఐడి కేసుల్లో బెయిల్ పొందినప్పటికీ, తాజాగా మరో కొత్త కేసు ఆయనకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఈ కేసులో సిఐడి విచారణకు కూడా హాజరైన పోసాని, తాను సొంతంగానే మాట్లాడానని, ఎవరికీ సంబంధం లేదని వాదించారు.

మరోవైపు ఈ కేసులో సాక్షి ఛానల్ పాత్రపై కూడా చర్చ జరుగుతోంది. ఈనాడు, జ్యోతి పత్రికలు ప్రస్తావించినట్లుగా సాక్షి ఛానల్ ప్రోద్బలంతోనే పోసాని ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టారని, వారే వీడియోలు ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య పోసాని బెయిల్‌పై విడుదలవుతారా లేదా అనేది వేచి చూడాలి. సిఐడి కోర్టు బెయిల్ మంజూరు చేస్తే ఈ వారంలోనే ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది. లేదంటే మాత్రం ఆయన మరికొంతకాలం జైలులోనే ఉండాల్సి వస్తుంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.

ఏదేమైనా జగన్ గెలుస్తారని నమ్మకంతో చాలామంది తమకు నచ్చినట్లు ప్రవర్తించారు, నోటికొచ్చినట్టు మాట్లాడారు. లోకేష్ రెడ్ బుక్‌లో వారందరి పేర్లు ఎక్కించి, ఒక్కొక్కరిగా తాట తీస్తున్నారని తెలుస్తోంది. నెక్స్ట్ ఆర్కే రోజా, కొడాలి నాని వంటి నేతలపై కేసులు పెట్టి జైల్లోకి తోసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఈ కొన్నేళ్లలో ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూడాలి. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వస్తే పరిస్థితి ఇంకెంత తీవ్రంగా మారుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: