ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు.. చాలా వింతగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. అక్కడ కుల రాజకీయాలు ఎక్కువ.  ఈ నేపథ్యంలోనే ప్రాంతీయ పార్టీలకు ఎక్కువగా అవకాశాలు దక్కుతున్నాయి. జాతీయ పార్టీలను... ఏపీ ప్రజలు ఆచరించడం లేదు. ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే.  కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత... అభివృద్ధి పైన దృష్టి పెట్టి ముందుకు సాగుతోంది ఏపీ ప్రభుత్వం.


ముఖ్యంగా నారా లోకేష్.. ఐటి శాఖ అలాగే విద్యాశాఖ మంత్రిగా తనదైన ముద్ర వేసుకుంటున్నాడు. అదే సమయంలో టిడిపి పార్టీని.... కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.  అయితే తాజాగా.. టిడిపిని ఆదరించే ఎన్టీఆర్ అభిమానులను.... కూడా తన వైపు లాక్కునే విధంగా సరికొత్త ప్రయత్నం చేశాడు నారా లోకేష్. ఎన్నడూ లేని విధంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని... పట్టుకొని మరీ ఫ్యాన్స్ కు చూపించాడు.  ఈ సంఘటన నూజివీడు మండలంలో చోటుచేసుకుంది. నూజివీడు మండలం సీతారాంపురం వద్ద మంత్రి నారా లోకేష్ కు... టిడిపి శ్రేణుల నుంచి మంచి స్వాగతం లభించింది.


 వేలాది సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను.... అక్కడే ఉన్న అభిమానులందరూ ప్రదర్శించడం జరిగింది. టిడిపి కార్యక్రమం ఎక్కడున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనబడతాయి అన్న సంగతి తెలిసిందే. అందుకే మంత్రి నారా లోకేష్ పర్యటనలో కూడా ఈ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనిపించాయి. అయితే వాళ్లందరినీ ఆకట్టుకునేందుకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వెంటనే ఆఫ్ ఫ్లెక్సీ ని తీసుకొని చూపిస్తూ కొద్దిసేపు అభిమానులను...  మరింత ఎంటర్టైన్ చేశాడు.


దీంతో జూనియర్ అభిమానులు ఒక్కసారిగా... అరుస్తూ... జై టిడిపి అంటూ నినాదాలు కూడా చేశారు. అయితే చంద్రబాబు కుటుంబానికి అలాగే జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య గ్యాప్ ఉందని... చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అదేమీ లేదని చెప్పే ప్రయత్నంలో భాగంగా నారా లోకేష్... ఈ విధంగా చేశారని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: