
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 16,862 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు ఏపీ హోం మంత్రి అనిత. 2014 -19 మధ్య కాలంలో సీఎం చంద్రబాబు పాలనలో 7,623 కానిస్టేబుల్ నియామకాలు చేపట్టామని తెలిపారు ఏపీ హోం మంత్రి అనిత. ప్రస్తుతం ఉన్న 16,862 కానిస్టేబుల్ పోస్టుల్లో 6,100 పోస్టుల నియామకం పూర్తి కానుందన్నారు ఏపీ హోం మంత్రి అనిత. మిగిలిన 10,762 ఖాళీల నియామకానికి ప్రభుత్వానికి, డీజీపీ గారికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందని వెల్లడించారు.
అనుమతులు రాగానే మిగిలిన పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలు చేపడతామని స్పష్టం చేశారు. పోలీసుల వెల్ఫేర్ పై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు ఏపీ హోం మంత్రి అనిత. ప్రమాదవశాత్తు చనిపోతే 10 నుంచి 15 లక్షల వరకు వచ్చే ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఇక అటు మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ... 2014-19 వరకు నాలుగు వేల కోట్లు ఇన్సెంటివ్స్ ఇచ్చామన్నారు. 2019-24 మధ్యలో కేవలం రెండు వేల కోట్లు మాత్రమే ఇచ్చారని వివరించారు. టెక్స్ టైల్ పాలసీ ఇచ్చి గైడ్లైన్స్ కూడా ఇవ్వలేదని తెలిపారు.
అశోక్ ఇన్ లాండ్ గత ప్రభుత్వ హయాంలో పారిపోయారని చురకలు అంటించారు. నిన్న మళ్ళీ రీస్టార్ట్ చేయించటం జరిగిందని వెల్లడించారు. వాటర్ చార్జెస్ కూడా చాలా పెంచారని తెలిపారు. పార్టనర్ షిప్ సమ్మిట్స్ కూడా గత ప్రభుత్వంతో పోలిస్తే ఎక్కువగా చేస్తున్నామని ప్రకటించారు. 2019-24 లో అసలు ఈ శాఖనే పట్టించుకోలేదని ఆగ్రహించారు.