
టిడిపి ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావుతో తనకు ప్రాణహాని ఉందంటూ జనసేన జనసేన శ్రీనివాసరావు పలు రకాల ఆరోపణలు చేయడం జరిగింది. ముఖ్యంగా కొలకపూడి శ్రీనివాస్ చేస్తున్న అవినీతిపైన తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలియజేశారు. అలాగే మట్టి, మద్యం లలో కూడా అవినీతిలో వాటా పంచుకున్నారని ప్రజలకు అన్ని విషయాలు చెప్పాలి అంటూ కొలికపూడిని డిమాండ్ చేయడం జరిగింది జనసేన కార్యకర్తలు.. అంతేకాకుండా ఒక్కో ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర కూడా 2 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయని అందుకు సంబంధించి పూర్తి వివరాలు కూడా తమ దగ్గర ఉన్నాయంటూ జనసేన సమన్వయ కర్త అయినటువంటి శ్రీనివాసరావు తెలియజేశారు.
ఈ విషయానికి సంబంధించి అన్ని వివరాలు కూడా వాళ్ల నాయకుల చెప్పారంటూ తెలియజేస్తున్నారు. దీనిపైన పూర్తి విచారణ చేయాలంటూ అక్కడ జనసేన కార్యకర్తలు కూడా డిమాండ్ చేస్తున్నారు..వీటికి తోడు విద్యుత్ శాఖల ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఇప్పిస్తామంటూ కూడా ఒక్కొక్క నిరుద్యోగి దగ్గర నుంచి ఆరు లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలియజేశారు. అందుకు సంబంధించి ఆ బాధ్యతలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఉందంటూ శ్రీనివాసరావు తెలియజేయడం జరిగింది. మరి మొత్తానికి టిడిపి ఎమ్మెల్యే పైన వస్తున్న ఈ ఆరోపణల పైన ఏవిధంగా ఎమ్మెల్యే స్పందిస్తారో అధికార ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.