
2014 ఎన్నికల్లో పేట నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల వేళ పార్టీ అధికారంలోకి వస్తుందనుకుంటోన్న టైంలో జగన్ టీడీపీ నుంచి వచ్చిన విడదల రజనీ కి సీటు ఇవ్వగా సీటు వదులుకున్న మర్రి కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ని చేసిన కేబినెట్లో తన పక్కన కూర్చో పెట్టుకుంటానని జగన్ బహిరంగంగా హామీ ఇచ్చారు. అయితే మంత్రి పదవి ఇవ్వకుండా పైగా రజనీకి మంత్రి పదవి ఇచ్చారు. మర్రికి ఎమ్మెల్సీ కూడా ఎన్నికలకు ఆరు నెలల ముందు అయిష్టంగా ఇచ్చారు.
మొన్న ఎన్నికల్లో రజనీని గుంటూరు పశ్చిమంకు మార్చినప్పుడు కూడా రాజశేఖర్‌కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తానని ఇవ్వలేదు. ఎన్నికల తర్వాత అయినా రాజశేఖర్ కు చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఇస్తామని చెప్పి తిరిగి రజనీకే ఇన్‌చార్జ్ ఇచ్చారు. ఇలా వైసీపీ లో పదే పదే అవమానాలతో పాటు జగన్ సైతం ద్రోహం చేయడంతో వీటిని తట్టుకోలేక ఆయన పార్టీ మారి పోదామని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన నరసారావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు డైరెక్షన్ లో టీడీపీలో చేరే ఏర్పాట్లు చేసుకుంటున్నారు.