ఆంధ్రప్రదేశ్ లో అధిక శాతం నిరుద్యోగులు ఉపాధ్యాయ, పోలీస్ రిక్రూట్మెంట్ కోసం ఏళ్ల తరబడిగా ఎదురు చూస్తున్నారు.. పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గతంలో జారీ చేయగా ప్రస్తుతం నియామక స్టేజ్ లో వుంది.. అయితే ఎక్కువ మంది నిరుద్యోగులు ఉపాధ్యాయ నియామక పరీక్ష అయిన “డీఎస్సి” కోసం ఎదురు చూస్తున్నారు…రాష్ట్రంలో గత 6 ఏళ్లుగా డీఎస్సి నిర్వహించలేదు.. 2018 లో 7 వేల కు పైగా ఉపాధ్యాయ పోస్టులకు అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా ఆ తరువాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్ వారికి పోస్టింగులు ఇవ్వడం జరిగింది.. అయితే ఆ తరువాత వైసీపీ గవర్నమెంట్ అధికారంలో వున్న 5 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోవడం ఎన్నికలకు రెండు నెలల ముందు 6100 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం.. అది కూడా కోర్ట్ కేసుల మూలంగా ఆగిపోవడంతో నిరుద్యోగులు అంతా ఈసారి కూటమిని అత్యధిక మెజారిటీ తో గెలిపించారు..

అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు మొదటి సంతకం డీఎస్సి ఫైలు పైనే సంతకం చేసారు.. రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ పోస్టులు నియామకం చేపడతామని వారు నిరుద్యోగులకు హామీ ఇచ్చారు.. అయితే మెదటి సంతకం పెట్టి 9 నెలలు గడిచాయి.. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం డీఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు.. అయితే ఎస్సీ వర్గీకరణ అడ్డుగా ఉందని ప్రభుత్వం మాట దాటుకుంటూ వచ్చింది.. తాజాగా ఎస్సీ వర్గీకరణపై నియమించిన వన్ మ్యాన్ కమీషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ తాజాగా ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించింది..

ప్రభుత్వ క్యాబినేట్ ఆ నివేదికకు ఆమోదముద్ర వేయగా తాజాగా అసెంబ్లీలో సైతం తీర్మానం చేసి ఆమోదించారు.. అయితే ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ వర్గీకరణ ఇప్పట్లో పూర్తి కాదని వైసీపీ వాదిస్తుంది.. దీనిపై కోర్ట్ కేసులు పడటం ఖాయమని డీఎస్సి ఇవ్వడం ఇష్టం లేకే ప్రభుత్వం వర్గీకరణ పేరుతో నాటకం ఆడుతుంది అని వైసీపీ ఆరోపిస్తుంది.. మరోవైపు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ కమిషన్ పై ఆర్డినెన్స్ తెచ్చి డీఎస్సి నోటిఫికేషన్ ఈ నెలలోనే ఇస్తామని చెబుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: