
బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్స్ కు రానా ప్రచారం పైన వివరణ ఇస్తూ.. నైపుణ్యం ఆధారిత గేములకు బ్రాండ్ అంబాసిడర్ గా మాత్రమే రానా వ్యవహరించారని ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు తర్వాత దీని గడువు 2017లో ముగిసింది. ఆన్లైన్ గేమ్లను చట్టబద్ధంగా అనుమతి పొందిన వాటికే రానా ఆమోదం తెలిపారని తెలిపారు.. అంతేకాకుండా ఒప్పందం చేసుకునే ముందు కూడా రానా న్యాయ బృందం కూడా అన్ని భాగాలను చాలా క్షుణ్ణంగానే పరిశీలించిన తరువాతే అన్ని అనుకూలంగా ఉండేలా ప్లాట్ఫామ్ నే అంగీకరించారని తెలిపారు.
అందుకు సంబంధించి రానా టీమ్ ఒక ప్రెస్ నోట్ ని కూడా జారీ చేస్తున్నామంటు రిలీజ్ చేశారు. జనానికి వ్యతిరేకంగా భారత సుప్రీంకోర్టు గుర్తించినటువంటి ఈ ఆన్లైన్ గేమ్లను హైలైట్ చేయడం చాలా అవసరము.. ఈ గేములు నైపుణ్యం మీదే ఆధారపడి ఉంటాయని అందువల్లే చట్టబద్ధంగా కూడా కోర్టు అనుమతి ఇచ్చిందంటూ రానా టీమ్ క్లారిటీ ఇచ్చింది.. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్లో 25 మంది సినీ ప్రముఖుల పేర్ల పై కేసులు నమోదు కావడం జరిగింది.