ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగులకు సైతం సీఎం చంద్రబాబు తీపి కబురు చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ రోజున 6,200 కోట్ల రూపాయలు చెల్లించబోతున్నట్లు సీఎం చంద్రబాబు తెలియజేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు..CPS,APGP కింద ఆర్థిక శాఖ 6200 కోట్ల రూపాయలను ఈ రోజున విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.2025 జనవరి 11న ఉద్యోగులకు సంబంధించి వివిధ బకాయిల కింద 1033 కోట్ల రూపాయలు ఉండగా విడుదల చేసింది.


ఏపీలో ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందంటూ సీఎం చంద్రబాబు మాట్లాడడం జరిగింది. ఇక తమకు రావలసిన ఈ బకాయిలను రిలీజ్ చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంతమేరకు ఆనందాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనకు సైతం ఏపీ శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేసిందట. మండలి లో ఎస్సీ ఉప వర్గీకరణ పైన కూడా ఒక కమిటీ ప్రవేశపెట్టామంటూ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలియజేయడం జరిగింది.


ఎస్సీ వర్గీకరణ చేయడానికి అందుకు సంబంధించిన అంశాలు ఏకసభ్య కమిషన్ నియమించేందుకు కారణాలు ఉన్నాయంటూ మంత్రి అనిత వివరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో వెనుకబాటతనాన్ని పరిగణంలోకి తీసుకొని మరి ఎస్సీ వర్గీకరణను చేయబోతున్నట్లు హోంశాఖ మంత్రి అనిత వెల్లడించారు. ఎస్సీలను వెనుకబాటు తనం ఆధారంగా మూడు విభాగాలుగా గుర్తించి విభజించి మరి వారికి రిజర్వేషన్ కల్పించాలంటూ ఈ కమిటీ నిర్ణయించినట్లు తెలియజేశారు.. అందులో ఒకటి అత్యంత వెనుకబడిన వర్గం, తక్కువ వెనుకబడిన వర్గం, చివరిగా వెనుకబడిన వర్గం వంటిగా మూడు భాగాలుగా విభజించినట్లు వెల్లడించారు ఎస్సీలకు ఉద్యోగ నియామకాలు అలాగే పదోన్నతులలో రిజర్వేషన్లు వంటివి చేపట్టబోతున్నట్లు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలియజేశారు. మొత్తానికి అటు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అయితే తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: