వైసిపి పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్త మీదన విచిత్రమైనటువంటి దాడి జరిగింది.. ఏదో అక్రమణి క్వారీ ట్రక్కుల బీభత్సవం మీదన ఎంపీ ఎందుకు స్పందించడం లేదంటే వైసీపీ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తగా పేరుపొందిన  శివ నారాయణ రాజు అనేటువంటి ఆయన ప్రశ్నించడం జరిగిందట.. దీంతో ఇతను నర్సీపట్నం దగ్గర వ్యక్తి  అని గుర్తించి..ఆరుగురు వ్యక్తులు వారి ఇంటికి వచ్చి మరి మాట్లాడే పని ఉందని మేడ మీదకు తీసుకువెళ్లి మరి భారీగా కొట్టించారట. దెబ్బలు తట్టుకోలేక శివనారాయణరాజు అరవడంతో ఇంట్లో పిల్లలు బయటికి వచ్చి పెద్దగా కేకలు వేస్తూ అరిచారట.



దీంతో చుట్టుపక్కల వారంతా కూడా అక్కడికి చేరుకోవడంతో అక్కడి నుంచి ఆ దుండగులు పారిపోయారట.. మైనింగ్ గురించి ఎంపీ స్పందించాలని తాను మాట్లాడినందు వల్లే ఈ దాడి జరిగిందంటూ సోషల్ మీడియా కార్యకర్త అయినటువంటి శివరామరాజు తెలియజేసినట్లు తెలుస్తోంది.. సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగులు వాడినటువంటి కారు ఆరుగురు వ్యక్తులకు సంబంధించిన ఫోటోలను కూడా సేకరించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. వీటి ఆధారంగా టౌన్ పోలీసులకు సైతం ఫిర్యాదు చేస్తామంటూ తెలియజేశారట.


 ఇంత బాగానే ఉంది కానీ.. పోలీసులు కేసు నమోదు చేసి మరి నిజంగా అరెస్టు చేస్తారా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.. ఒకవేళ ఇదే రాజకీయం కంటిన్యూ అయితే ఆంధ్రాలో మరొకసారి కొత్త రాజకీయానికి తెర లేపేలా నాంది పలికినట్లు కనిపిస్తోంది.ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా ప్రశ్నించే వారందరిని అక్రమ అరెస్టు చేస్తే కచ్చితంగా రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవని చాలామంది నేతలతో పాటు ప్రజలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ విషయం పైన అటు ఎంపీ కాని, సీఎం చంద్రబాబు గాని ,వైసీపీ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. ఇప్పటికే ఏపీలో చాలామంది పైన అక్రమ కేసుల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: