పల్లెటూర్ల నుంచి పట్టణాలకు, నగరాలకు, మెట్రో నగరాలకు యువత వలసలు ఒక ప్రవాహంలా కొనసాగుతున్నాయి. ఎందుకు, ఇదే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిని తొలుస్తోంది. ఊర్లో ఉన్న చాలీచాలని బతుకులకు స్వస్తి చెప్పి, భవిష్యత్తుపై బోలెడన్ని ఆశలతో నగరాల బాట పడుతున్నారు. కానీ అందరూ ఒకే నగరాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారు? అందరి చూపు హైదరాబాద్ వైపే ఎందుకు?

ఎందుకంటే మన పల్లెటూళ్లలో ఒకడు ఇడ్లీ బండి పెట్టుకుంటే చాలు.. "ఏందిరా మీ వాడు అట్టా తయారైపోయాడు?" అని ముక్కున వేలేసుకుంటారు. అదే హైదరాబాద్‌లో అయితే "వాడు ఫుడ్ బిజినెస్‌లో దుమ్ము దులుపుతున్నాడు" అంటారు. మన ఊర్లో ఇడ్లీ అమ్ముకునే వాడికి పిల్లనివ్వడానికి వెనకాడతారు. అదే హైదరాబాద్‌లో అయితే క్యూ కడతారు. ఇది కేవలం ఇడ్లీ బండి గురించే కాదు.. ప్రతి విషయంలోనూ అంతే. పల్లెటూళ్లలో ప్రతి చిన్న విషయాన్ని తప్పుగా చూస్తారు. అదే నగరాల్లో అయితే వెన్నుతట్టి ప్రోత్సహిస్తారు. అందుకే యువత నగరాలకు ముఖ్యంగా హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారు.

ఐతే, నగర జీవితం అందరికీ అనుకూలమా? కేవలం కోటీశ్వరులు మాత్రమే బతకగలరా? ధనవంతులో మాత్రమే ఇక్కడ బతకగలరు అనేది పూర్తిగా అపోహ మాత్రమే. హైదరాబాద్‌లో పేదవాడు బతకగలడు.. ధనవంతుడు బతకగలడు.. మధ్యతరగతి మనిషి బతకగలడు. దేశంలోని ప్రధాన నగరాల జీవన వ్యయాలను పరిశీలిస్తే.. బెంగళూరులో కనీసం 20 వేలు, ముంబైలో 30 వేలు దాటుతుంటే.. హైదరాబాద్ కేవలం 12 వేలతో బతకొచ్చు. ఇంకాస్త లగ్జరీ లైఫ్ కావాలంటే 50 వేలు చాలు. దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో బతకడం చాలా చౌక. అందుకే ఇది సామాన్యుడికి సైతం స్వర్గధామంలా మారింది.

సో.. పాయింట్ ఏమిటంటే.. హైదరాబాద్ కేవలం నగరం కాదు.. అది ఒక అనుభూతి. అవకాశాల వేదిక. భవిష్యత్తుకు భరోసా. పల్లెటూళ్లలో సంకుచిత మనస్తత్వంతో కుంచించుకుపోయే బదులు.. హైదరాబాద్ రండి.. మీ కలలకు రెక్కలు తొడగండి. పల్లె అవమానాలు మర్చిపోండి హైదరాబాద్‌లో కలల పండగ చేసుకొండి. తక్కువ ఖర్చుతో మీ టాలెంట్ చూపించి భవిష్యత్తు మార్చుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: