బుల్లితెర యాంకర్ గా దాదాపుగా 15 సంవత్సరాల నుంచి మంచి గుర్తింపును సొంతం చేసుకున్న శ్యామల అడపాదడపా సినిమాల్లో నటించి ఆ పాపులారిటీని మరింత పెంచుకున్నారు. సినిమాల్లో అభినయ ప్రధాన పాత్రలు పోషించిన శ్యామల గతంలో తన భర్తకు సంబంధించిన పలు ఆరోపణల ద్వారా వార్తల్లో నిలిచారు. అయితే ఆ సమయంలో శ్యామల తన భర్త ఏ తప్పు చేయలేదని సమర్థించారు.

 
ఎవరూ ఊహించని విధంగా శ్యామల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం కేసులో చిక్కుకోగా ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా కావడంతో ఆమె వల్ల వైసీపీకి చెడ్డ పేరు వస్తోంది. వైసీపీ నుంచి శ్యామలను సస్పెండ్ చేయాలని జనసేన నేత కిరణ్ రాయల్ కోరారనే సంగతి తెలిసిందే. శ్యామలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ అభిమానుల నుంచి కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

 
అయితే బెట్టింగ్ యాప్స్ కేసులకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని శ్యామల భర్త చెబుతున్నా ఈ కేసులో శ్యామల చిక్కుకున్నట్టేనని తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో గతంలో ఈ యాప్స్ ను ప్రచారం చేసిన సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. శ్యామల వైసీపీ తరపున వాయిస్ వినిపిస్తే నష్టమే తప్ప పార్టీకి ప్రయోజనం ఉండదు.

 
సాక్షి ఛానల్, పత్రికలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన పలువురు సెలబ్రిటీలపై వ్యతిరేక కథనాలు ప్రసారమవుతున్న నేపథ్యంలో శ్యామలను సస్పెండ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఏపీ పేరుతో ఉన్న బెట్టింగ్ యాప్ ను ఆమె ప్రమోట్ చేశారు. అయితే సెలబ్రిటీలు ఈ తరహా వివాదాల్లో చిక్కుకున్నా చివరకు ఈ కేసులు మరుగున పడతాయని వాదించే వాళ్లు సైతం ఉన్నారు. శ్యామలపై నమోదైన కేసుకు సంబంధించి ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాలి. యాడ్స్, ప్రమోషన్స్ విషయంలో సెలబ్రిటీలు ఒకింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: