
* తిరుమలలో ప్రకటించిన సీఎం చంద్రబాబు..
* బాబుకి ఆర్సీవై ధన్యవాదాలు.. మిగిలిన డిమాండ్లపై ప్రశ్నలు..
* స్వామీజీలు, భక్తులు అందరిలో కొంత ఉపశమనం.. కొంత ఆందోళన..
బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పోరాట ఫలితంగా.. తిరుమల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.. అలిపిరి దగ్గర ముంతాజ్ హోటల్ కు కేటాయించిన భూమిని రద్దు చేస్తూ.., జీవో నెంబర్ 24ను ఉపసంహరించుకోనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.. ఈరోజు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న అందంతరం తిరుమలలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఈ ప్రకటన చేశారు.. అలాగే అన్యమతస్థులను బదిలీ చేస్తామని పేర్కొన్నారు.. తిరుమల ఏడుకొండల సరిహద్దుల్లో/ పరిసరాల్లో ఎక్కడా వాణిజ్య అవసరాలకు భూములు ఇవ్వమని ప్రకటన.. ఇప్పటికే ఇచ్చిన 35 ఎకరాలను రద్దు చేస్తామని చెప్పారు..!
గతవారం ఆర్సీవై ఆందోళన.. ప్రభుత్వానికి అల్టిమేటం!!
ముంతాజ్ హోటల్ కు భూ కేటాయింపులు రద్దు సహా మరో ప్రధానమైన ఏడు డిమాండ్లతో రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో భక్తులు, స్వామీజీలు అలిపిరి నుండి తిరుమలకు పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే.. ఆ డిమాండ్ల సాధన కోసం స్వామివారికి నేరుగా వినతి పత్రం అందించడానికి "వెంకన్నకు విన్నవిద్ధాం" కార్యక్రమానికి పిలుపునిచ్చి.., శాంతియుతంగా నిరసనలు తెలియజేసిన విషయం తెలిసిందే.. అయినప్పటికీ పోలీసులు దురుసుగా ప్రవర్తించిన నిరసనలు అడ్డుకుని.., అరెస్టు చేశారు.. ఆ ఘటన అనంతరం రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ.. మూడు ప్రధాన డిమాండ్లను, ఏడు రోజుల్లో పరిష్కరించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేసారు.. లేనిపక్షంలో తీవ్రమైన పోరాటం చేస్తామని హెచ్చరించారు..!!
రెండు డిమాండ్లు పరిష్కారం.. మిగిలినవి.. ఆర్సీవై సందేశం..!
తాజాగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని కీలక అంశాలపై ప్రకటన చేసారు. "బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ప్రభుత్వం ముందు పెట్టిన మూడు డిమాండ్లలో ముంతాజ్ హోటల్ కు భూమి కేటాయింపు ప్రధానమైనది.. & అన్యమతస్థుల బదిలీ విషయంలో కూడా ఆర్సీవై గతంలో ఏడు డిమాండ్లలో పేర్కొన్నారు.. వీటిపై బాబు సానుకూలంగా స్పందించి.. నేడు ప్రకటన చేసారు.. దీనిపై ఆర్సీవై కూడా శుక్రవారం ఒక వీడియో విడుదల చేసారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ఆయన.. మిగిలిన డిమాండ్లపై కూడా వెంటనే స్పందించాలని డిమాండ్.. ఈ పోరాటంలో తనకు సహకరించిన స్వామీజీలకు కృతజ్ఞతలు తెలిపారు.. అలాగే ఈ భూమిని టీటీడీకి అప్పగించి, కేవలం భక్తుల సేవకు మాత్రమే వినియోగించాలని సూచించారు.. తిరుమలలో సొంత డెయిరీ, టీటీడీ బోర్డు ప్రక్షాళన, వీఐపీ దర్శనాలు రద్దు వంటి తమ కీలక డిమాండ్లపై పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు..!!