తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇటీవల బిర్ల ధరలు పెంచి.. మందుబాబులపై భారం వేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం... ఇప్పుడు సానుకూలమైన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా బార్లను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 70 బార్లను కొత్తగా ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుందట తెలంగాణ ఎక్సైజ్ శాఖ. తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.


 
అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ... 70 బార్ల ను ఏర్పాటు చేసేందుకు మాత్రం తీసుకోవడం జరిగిందని చెబుతున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రాబోతుందట. అందుకు అనుగుణంగానే ఇన్కమ్ ఎక్కువగా వచ్చే ప్రాంతాలపై దృష్టి పెట్టబోతుందట రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
ఇప్పటికే... తెలంగాణ రాష్ట్రంలో 1171 బార్లు ఉన్నాయి. ఇందులో సగానికి పైగా హైదరాబాద్ అలాగే సికింద్రాబాద్ మహా నగరాలలో ఉండటం గమనార్హం. మైక్రోబువరీల సంఖ్య ను పెంచే అవకాశాలు ఉన్నట్టు కూడా చెబుతున్నారు.


 ముఖ్యంగా మున్సిపాలిటీ నగరాలలో ఈ 71 బార్లను విస్తరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో మద్యం తాగే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉత్తర తెలంగాణ వైపు మాత్రమే ఎక్కువ బార్లు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. అదే కాకుండా మొన్న బీర్లపై ధరలు పెంచిన రేవంత్ రెడ్డి సర్కార్... త్వరలోనే లిక్కర్ పైన కూడా 20 నుంచి 30 రూపాయలు పెంచే యోచనలో  ఉన్నట్టు తెలుస్తోంది.తెలంగాణ బీర్లపై... ధరలు పెంచడంతో ఇప్పటికే విపరీతంగా ఆదాయం అర్ధిస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇప్పుడు లిక్కర్ పై కూడా ధరలు పెంచి... డబ్బులు వసూలు చేయాలని చూస్తోంది. తెలంగాణ ఆదాయం ఈ మధ్యకాలంలో భారీగా తగ్గిపోయిన నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది రేవంత్ రెడ్డి సర్కార్.

మరింత సమాచారం తెలుసుకోండి: