
పేదలను తరిమేస్తే పేదరికం తగ్గిపోతుందా, ఇదేం లాజిక్ అని అనుకుంటున్నారా, అక్కడ జరుగుతున్నది అదే మరి. కేరళ నుండి వలస వచ్చిన వాళ్లే ఇక్కడ టీ కొట్టులు నడుపుతున్నారు, నర్సింగ్ పనులు చేస్తున్నారు. అంటే అక్కడ పేదలు లేరా, లేరు అని కాదు, వాళ్ళు వేరే చోట బతుకుతున్నారు అంతే, కేరళలో సంపాదించిన డబ్బులతో తల్లిదండ్రులు మాత్రం హాయిగా కూర్చుని తింటున్నారు. అందుకే రికార్డుల్లో పేదరికం తక్కువగా కనిపిస్తుంది.
గోవా విషయానికి వస్తే, అక్కడ పరిస్థితి కాస్త భిన్నం. గోవాలో పేదరికం 0.8 శాతం మాత్రమే. అక్కడోళ్లు ఎక్కడికీ పోరు, అక్కడే ఉంటారు, అక్కడే బతుకుతారు. మరి వాళ్ళ పేదరికం ఎలా తగ్గిందంటే టూరిజం పుణ్యమా అని గోవా కళకళలాడుతోంది. పర్యాటకం అభివృద్ధి చెందడంతో ఆర్థికంగా మంచి వృద్ధి సాధించింది. దాంతో పేదరికం వాటంతట అటే తగ్గిపోయింది. గోవాలో ప్రతి ఒక్కరికీ ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇదిలా ఉంటే, తమిళనాడులో 2.2 శాతం, సిక్కింలో 2.6 శాతం, ఢిల్లీలో 3.4 శాతం పేదరికం ఉంది. ఈ రాష్ట్రాలు కూడా బాగానే అభివృద్ధి చెందుతున్నాయి అని చెప్పొచ్చు. మరోవైపు అత్యధిక పేదరికం ఉన్న రాష్ట్రాల గురించి వింటే మాత్రం గుండె గుభేలుమనక మానదు. బీహార్‌లో ఏకంగా 33.8 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారు. జార్ఖండ్ 28 శాతం, మేఘాలయ 27.8 శాతం, ఉత్తరప్రదేశ్ 22.9 శాతం, మధ్యప్రదేశ్ 20.6 శాతం పేదరికంతో అల్లాడుతున్నాయి.
ఈ రాష్ట్రాల్లో పేదరికం పెరగడానికి కారణాలు అనేకం. నిరుద్యోగం, సరైన వసతులు లేకపోవడం, విద్య వైద్యం అందరికీ అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు ఇక్కడ తీవ్రంగా ఉన్నాయి. ఈ రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తేనే పేదరికం తగ్గే అవకాశం ఉంది.
మొత్తానికి దేశంలో పేదరికం ఒక పెద్ద సమస్య. కొన్ని రాష్ట్రాలు పేదరికాన్ని తగ్గించడంలో సఫలమయ్యాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పేదరికం లేని దేశమే మన లక్ష్యం కావాలి.