
ఇందులో కొంతమంది జైలులో ఉంటే... మరి కొంతమంది... బెయిల్ పైన వచ్చారు. ఏ క్షణమైన మరికొంతమంది వైసిపి నేతలు అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో.... ఏపీ లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసిపికి మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. నంద్యాల జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. వైస్సార్సీపీ కార్యకర్త ను దారుణంగా హత్య చేయించారు. బండి ఆత్మకూరు ( మం) లింగాపురంకు చెందిన వైస్సార్సీపీ కార్యకర్త సుధాకర్ రెడ్డి దారుణ హత్య గురయ్యాడు.
ఈ సంఘటన ఇవాళ ఉదయమే చోటు చేసుకుంది. నారాయణ పురం , జి.సి.పాలెం మధ్య ఉన్న పొలానికి వెళ్లాడు వైస్సార్సీపీ కార్యకర్త సుధాకర్ రెడ్డి. ఈ తరుణంలోనే.. వైస్సార్సీపీ కార్యకర్త సుధాకర్ రెడ్డి.... తిరిగి వస్తుండగా , దారి కాచి కత్తులతో దాడికి పాల్పడ్డారు ప్రత్యర్థులు. తలపై నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు వైస్సార్సీపీ కార్యకర్త సుధాకర్ రెడ్డి.
అయితే.. ఈ సంఘటన తెలియగానే.. రంగంలోకి దిగారు పోలీసులు. ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వైస్సార్సీపీ కార్యకర్త సుధాకర్ రెడ్డి హత్య కు ఆధిపత్య పోరే కారణమంటున్నారు స్థానికులు. ఇక మరి కొంత మంది టీడీపీ పార్టీ నేతలే చంపారని ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికి వైస్సార్సీపీ కార్యకర్త సుధాకర్ రెడ్డి హత్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.