
ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు.. పురందేశ్వరి తూర్పుగోదావరికి చెందిన ఓ కీలక నాయకుడికి అవకాశం ఇవ్వాలని భావించారు. ఈ క్రమంలో చివరి నిమిషం వరకు పురందేశ్వరి ప్రయత్నించారు.కానీ, ఆర్ ఎస్ ఎస్ తో బలమైన అనుబంధం ఉన్న సోము వీర్రాజు ఢిల్లీ నుంచి చేసిన ప్రయత్నంతో పురందేశ్వరి మౌనం వహించారు. చివరకు ఉన్న ఒక్కసీటు సోము దక్కించుకున్నారు.
ఇలానే.. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్-జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిల మధ్య రాజకీయ వైరం ముదిరిన విషయం తెలిసిందే. సీఎం రమేష్ దక్కించుకున్న కాంట్రాక్టులపై ఆది వర్గీయులు దాడు లు చేయడంతోపాటు విమర్శలు చేశారు. దీంతోఇదిరాష్ట్ర వ్యాప్తంగా వివాదానికి దారితీసింది. పలు జిల్లా ల్లో బీజేపీ నాయకుల మధ్య సమన్వయం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ పరిణామాలతో పురందేశ్వరి ఎవరిని మందలిస్తే.. ఏంజరుగుతుందో అన్న సందేహంతో మౌనంగా ఉండిపోతున్నారు.
ఇక, తాజాగా పురందేశ్వరిని ఆ పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఆమె పదవీ కాలం కూడా పూర్తయింది. ఈ క్రమంలో పలువురు కీలక నాయకులు ఏపీ చీఫ్ పదవిని దక్కించుకు నేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, మరోవైపు.. సోము కూడా ఢిల్లీలోనేతిష్ఠ వేసి.. ఏపీ బీజేపీ చీఫ్ పదవిని దక్కించుకునేందుకు తన ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.
దాదాపు ఆయన పేరును మరోసారి ఖరారు చేసేందుకు చాన్స్ ఉందని.. లేకపోతే.. ఈ దఫా రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం దక్కుతుందని అంటున్నారు. ఈ క్రమంలో తిరుపతికి చెందిన భాను ప్రకాశ్ రెడ్డిపేరు జోరుగా వినిపిస్తుండడం గమనార్హం. సోము కాదంటే.. భానుకు పదవి ఖాయమని అంటున్నారు.