
మిగతా రాష్ట్రాల నుంచి కూడా ప్రధాన నేతలు ఈ సమావేశానికి హాజరవుతూ ఉండగా ఏపీ నేతలు మాత్రం ఈ సమావేశానికి హాజరు కాకపోవడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. అయితే జగన్ డీ లిమిటేషన్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయగా మోదీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. అన్యాయం జరగకుండా చూడాలని జగన్ లేఖ రాయగా ఈ లేఖకు రెస్పాన్స్ రావడం కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
వచ్చే ఏడాది నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనుండగా దక్షిణాది రాష్ట్రాల నేతల అభిలాషకు కేంద్రం ఎంతమేర ప్రాధాన్యత ఇస్తుందో చూడాలి. టీడీపీ, జనసేన నుంచి ఈ తరహా రిక్వెస్ట్ వస్తే బాగుంటుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతుండగా ఆ కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే బీజేపీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీలో టీడీపీ, జనసేన అడుగులు వేసే ఛాన్స్ అయితే లేదు.
జనాభా లెక్కల ప్రకారం డీ లిమిటేషన్ చేయొద్దని దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పాటించడం జరిగిందని జగన్ పేర్కొన్నారు. అయితే ఇలాంటి లేఖలు గతంలో సైతం జగన్ రాసినా ఆశించిన ఫలితాలు వచ్చిన సందర్భాలు అయితే తక్కువగానే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ రాసిన లేఖను వైవీ సుబ్బారెడ్డి స్టాలిన్ కు సైతం పంపడం కొసమెరుపు. రాబోయే రోజుల్లో డీ లిమిటేషన్ గురించి సౌత్ ప్రజల్లో సైతం జోరుగా చర్చ జరిగే ఛాన్స్ అయితే ఉంది.