ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన విజన్ తో ప్రజల మెప్పు పొందడంతో పాటు టెక్నాలజీని సరైన విధంగా ఉపయోగించే నేతగా ప్రశంసలు అందుకున్నారు. రాజకీయాల్లో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలిన సమయంలో సైతం చంద్రబాబు నాయుడు ఒకింత తెలివిగా వ్యవహరించడం ఆయనకు అన్ని విధాలుగా కలిసొచ్చిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. చంద్రబాబు చేసే ప్రకటనలకు ప్రజల మద్దతు సైతం ఎప్పుడూ ఉంటుంది.

 
అయితే సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా లైట్లు, ఫ్యాన్లు ఆపేయాలంటూ సంచలన ప్రకటన చేశారు. ఈరోజు ప్రపంచ నీటి దినోత్సవం కావడంతో పాటు ఎర్త్ అవర్ కావడంతో చంద్రబాబు ఈ రిక్వెస్ట్ చేశారు. మన జీవితాలలో విద్యుత్, నీరు మూలస్తంభాలని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అన్ని జీవరాశులకు భూమి ఇల్లు అని భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఎంతో ఉందని బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.

 
ఈరోజు రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు లైట్లు, ఫ్యాన్లు ఆపేయాలని విద్యుత్ వాడకం చేయకుండా ఉండటం ద్వారా భూమికి మేలు చేయాలని కోరారు. ప్రపంచ దేశాల్లో ఉన్న కోట్ల సంఖ్యలో ప్రజలను ఎర్త్ అవర్ ఏకం చేస్తుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. నీరు, విద్యుత్ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. నీటిని పరిమితంగా వాడుకోవడం ద్వారా స్థిరమైన భవిష్యత్తుకు మార్గం సుగమం అవుతుందని చంద్రబాబు వెల్లడించారు.

 
ఈ విషయాలకు సంబంధించి ఏపీ సర్కార్ తన వంతు కృషి చేస్తున్నా సమిష్టి కృషి ఎంతో ముఖ్యమని చంద్రబాబు కామెంట్లు చేశారు. చిన్న చర్యలే రేపటి పెద్ద మార్పులకు దారి తీస్తాయని ఆయన అన్నారు. సమిష్టిగా కృషి చేయడం వల్ల ప్రభావవంతమైన మార్పు తీసుకొనిరావడం సాధ్యమవుతుందని చంద్రబాబు వెల్లడించారు. సొంతంగా నీరు, విద్యుత్ పొదుపు విషయంలో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: