
దీంతో ఒక్కసారిగా తూర్పుగోదావరి జిల్లా వైద్య అధికారులు గ్రామంలో 31 బృందాలతో ఇంటింటా సర్వేలు జరిపించి మరి గ్రామస్తులకు పరీక్షలు కూడా నిర్వహించారట.. బలభద్రపురం గ్రామంలో సుమారుగా పదివేల వరకు జనాభా ఉంటుందని.. ఇందులో ఇప్పటికే 23 మంది క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నట్లుగా అక్కడ జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలియజేశారు.. అయితే అక్కడ వాతావరణం, కాలుష్యం, నీరు గాలి అన్నీ కూడా కలుషితం కావడం చేతే గ్రామస్తులకు అక్కడ ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేస్తున్నారు.
బలభద్రపురం గ్రామానికి సమీపంలో ఉన్న గ్రాసిమ్ ఇండస్ట్రీ తో పాటుగా ఇతర పరిశ్రమల కారణం చేత అక్కడ నీరు గాలి అన్ని కూడా కలుషితమవుతున్నాయని దీని వల్లే చాలామంది క్యాన్సర్ బారిన పడ్డట్టుగా తెలియజేస్తున్నారు గ్రామస్తులు. దీంతో మరి కొంతమంది ఆ క్యాన్సర్ బారిన పడకుండా చూసుకోవాలని ప్రజలను కాపాడే బాధ్యత ప్రభుత్వాన్ని అంటూ అక్కడ స్థానికులు తెలియజేస్తూ ఉన్నారు. ఏడాదికాలంగా ఆ ఊరిలో క్యాన్సర్ తో మరణిస్తున్న వారే సుమారుగా 15 మంది కుటుంబాలు ఉన్నాయని వారిని పరామర్శించడానికి ప్రతిసారి వెళుతున్నానంటూ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలియజేస్తున్నారు. మరి ఇలాంటి విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు అండగా ఉంటుందో చూడాలి.. మరి ఈ విషయం సీఎం దాకా వెళ్తుందేమో చూడాలి.