ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో పెను సంచలనం చోటుచేసుకుంది. మొన్నటి వరకు వైసిపి నేతలను అరెస్టు చేసిన కూటమి ప్రభుత్వం... ఇప్పుడు వైసీపీలో ఉన్న కీలక మహిళ నేతలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మాజీ మంత్రులు రోజా అలాగే విడుదల రజిని లను టార్గెట్ చేసినట్లు సమాచారం అందుతుంది. తాజాగా మాజీ మంత్రి విడుదల రజినిపై ఏసీబీ కేసు కూడా నమోదు అయింది. 2020 నాటికి కేసులను తవ్వి మరి కేసులు పెడుతున్నారు.

 2020 సంవత్సరంలో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో... మాజీ మంత్రి విడుదల రజిని బెదిరింపులకు గురిచేసినట్లు అభియోగాలు వస్తున్నాయి.  శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రెండు కోట్ల 20 లక్షలు కూడా వసూలు చేశారట మాజీ మంత్రి విడుదల రజిని, ఆమె బృందం. ఈ నేపథ్యంలోనే విడుదల రజినిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అంతేకాకుండా ఈ కేసులో ఏ 1 ముద్దాయిగా విడదల రజిని  పేరు నమోదు  చేసినట్లు చెబుతున్నారు.

 ఇక ఈ కేసులో భాగంగానే... ఇవాళ మాజీ మంత్రి విడుదల రజినీకి  నోటీసులు కూడా జారీ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమెను అరెస్టు చేసే ఛాన్సులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. మొన్నటి వరకు మగ వైసిపి నేతలను అరెస్టు చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆడవాళ్లపై పడిందని వైసిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళి  , నందిగామ సురేష్,  తదితరులు  అరెస్ట్ అయ్యారు.

 ఇక ఇప్పుడు మాజీ మంత్రి రోజా అలాగే విడుదల రజిని అరెస్టు చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని తనిఖీల పేరుతో బెదిరించిన కేసులో విడుదల రజిని ఇరుకగా... ఆడదాం ఆంధ్ర  స్కామ్ లో మాజీ మంత్రి రోజాను ఇరికించే ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే రోజా అని కూడా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి: