
సిరి సంపదలు ఉన్న తెలంగాణను సైతం దోచుకోవడానికి కొంతమంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారంటూ కీలకమైన ఆరోపణలు చేశారు కేసీఆర్.. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు చాలా సంతోషంగా ఉండే వారిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారని కానీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని తెలియజేశారు.. దీంతో మరొకసారి తెలంగాణ ప్రాంతం తెలంగాణ సమస్యలలో చిక్కుకుపోయింది అంటూ తెలియజేశారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాటం చేసింది కూడా టిఆర్ఎస్ పార్టీ నే అంటూ తెలియజేశారు.
ఇక ఆంధ్రాలో విషయానికి వస్తే పొత్తు లేకుంటే చంద్రబాబు గెలిచేవారు కాదంటూ తెలిపారు. ఈ నెల పైన ఎవరు శాశ్వతం కాదని ఒక్కొక్కరు ఒక్కోసారి అధికారం లభిస్తూ ఉంటుందని.. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదని తెలిపారు.. తెలంగాణలో ఒక్కొక్కరు ఒక్కో కేసిఆర్ గా మారితే మళ్ళీ మనదే అధికారం వస్తుందని తెలియజేశారు.. తెలంగాణ హక్కుల కోసం మరొకసారి కచ్చితంగా పోరాటం చేస్తామంటూ ఎందుకోసం ప్రతి ఒక్క బీఆర్ఎస్ శ్రేణులు కూడా రావాలని పిలుపునివ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 14 నెలల పాటు అవుతూ ఉన్న ఇచ్చిన హామీలను సైతం ఇంకా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చ లేదంటే తెలియజేశారు. మొత్తానికి ఏపీలో ఒంటరిగా చేసే అవకాశం చంద్రబాబు , పవన్ కళ్యాణ్ కు లేదని అలా చేస్తే ఓడిపోతారనే విధంగా మాట్లాడినట్టుగా కనిపిస్తుంది కేసీఆర్.