తెలంగాణ రైతులకు ఊహించని షాక్ తగిలింది. రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. సంచలన ప్రకటన చేసింది. రెండు లక్షల కు పైన ఉన్నవారికి రుణమాఫీ చేయబోమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. దీంతో తెలంగాణ రైతులు ఆగమవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో... రైతు రుణమాఫీ పైన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు.


రెండు లక్షలకు పైగా  ఉన్న రైతులకు రుణమాఫీ చేయబోమని తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించడం జరిగింది.   ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఈ నెలాఖరులోగా  ఐదు ఎకరాల లోపు ఉన్నవారికి రైతు భరోసా అందిస్తామని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు 5 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా అందించినట్లు గుర్తు చేశారు తుమ్మల నాగేశ్వరరావు.

వ్యవసాయం, అలాగే సంక్షేమ రంగాలలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా ప్రకటించారు. బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత కూడా ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. రైతుల కోసం ఉచిత విద్యుత్ బతక కొనసాగిస్తున్నామని కూడా స్పష్టం చేశారు తుమ్మల నాగేశ్వరరావు.  కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అంటూ ఆయన వెల్లడించారు.

 ఇక... రెండు లక్షలకు పైన ఉన్నవారికి రుణమాఫీ చేయబోమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ప్రకటనపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కంటే ముందు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు... అధికారం వచ్చిన తర్వాత.. పంగనామాలు పెడుతోందని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతామని కూడా హెచ్చరిస్తున్నారు. అటు గులాబీ పార్టీ కూడా దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: