
- దేవాలయాల పాలక మండళ్లపై కసరత్తు పూర్తి
- సిద్ధమౌతున్న 222 మార్కెట్ యార్డ్ కమిటీల జాబితా.
- చైర్మన్ పదవులకు 2 నుంచి 3 పేర్ల ప్రతిపాదనలు.
రాష్ట్రంలో పలు ప్రముఖ దేవాలయాల పాలక మండళ్లను భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇప్పటికే పాలక మండళ్ల నియామకంపై చంద్రబాబు వద్దకు పూర్తి జాబితా అయితే చేరింది. తెలుగుదేశంతో పాటు జనసేన, బీజేపీ పార్టీలు ఇచ్చిన సిఫార్సుల జాబితా చంద్రబాబు వద్దకు చేరింది. మొత్తం 21 ప్రముఖ ఆలయాలకు పాలక మండళ్లను నియమించారు. దేవాలయ కమిటీ ఛైర్మన్‌తో పాటు సభ్యులను కూడా నియమించేందుకు రెడీ అవుతున్నారు.
మార్కెట్ కమిటీ ఛైర్మన్లు కూడా రెడీ... !
వ్యవసాయ మార్కెట్ కమిటీలను నియమించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయి కసరత్తులు చేస్తున్నారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో లోగా మార్కెట్ యార్డ్ చైర్మన్ల నియామకాలను చేపట్టేందుకు కార్యాచరణను సిద్ధం అవుతోంది. ఇప్పటికే మార్కెట్ కమిటీల నియామకాలకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది. ప్రతి జిల్లా నుంచి నివేదికలు తెప్పించుకుంటున్న అధిష్టానం రిజర్వేషన్ల ఆధారంగా పదవులను భర్తీ చేయాలని చూస్తోంది.
ఇక పదవుల్లో ఎస్సీ, ఎన్టీ, బీసీలతో పాటు ఓసి లకు సమ న్యాయం జరిగేలా సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. మహిళలకు కూడా అగ్రి కల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్లతో పాటు డైరెక్టర్ల పదవులు దక్కనున్నాయి. రాష్ట్రం లో 222 మార్కెట్ కమిటీ లు ఉండగా వీటన్నిటికీ చైర్మన్తో పాటు 15 మంది సభ్యులను ప్రభుత్వం నియమిస్తుంది. పదవుల్లో 50 శాతానికి పైగా పదవులు ఎస్సీ, ఎస్టీ బీసీలకు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధమైనట్టు తెలుస్తోంది. మొత్తానికి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల తర్వాత ఎట్టకేలకు పదవులు భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధ మవుతుండడంతో కూటమి పార్టీ నేతల్లో సంతోషం కనిపిస్తోంది.