- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .


ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి నారా లోకేష్ .. మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి పెద్ద షాక్ ఇచ్చారు. తాజాగా లోకేష్ జ‌గ‌న్ తీరుపై మ‌రోసారి విరుచుకు ప‌డ్డారు. త‌న‌దైన స్టైల్లో కౌంట‌ర్లు వేశారు. ఎవ‌రు ఎన్ని విమ‌ర్శ‌లు చేసుకున్నా ఏపీ లో యువ‌నేత లోకేష్ వ‌ర్సెస్ జ‌గ‌న్ .. అలాగే జ‌గ‌న్ వ‌ర్సెస్ ప‌వ‌న్ మ‌ధ్య జ‌రిగే మాట‌ల తూటాలు .. విమ‌ర్శ‌లు ఒక ఎత్తుగా నిలుస్తుంటాయి. ఎప్ప‌టికి అయినా ప్రభుత్వం శాశ్వతం .. రాజకీయాలు ఎన్నికలకే పరిమితం అన్న విష‌యం ఇప్పటికైనా తెలుసుకోండి జగన్ రెడ్డి గారు .. ప్రభుత్వం మారినా.. అభివృద్ధి, సంక్షేమాలు కొనసాగించే ప్రజాస్వామ్య స్ఫూర్తిని మీ విధ్వంసపాలనతో బ్రేక్ చేశార‌ని లోకేష్ ధ్వ‌జ‌మెత్తారు. 2019లో అధికారంలోకి వచ్చిన మీరు గత ప్రభుత్వ బకాయిలు మేమెందుకు చెల్లించాలి అంటూ మొండికేశార‌ని .. టిడిపి హయాంలో ప్రారంభమైన అభివృద్ధి పనులను నిలిపేశారు. మరికొన్ని ధ్వంసం చేశారు .. ఈ నిరంకుశ మనస్తత్వం ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని విమ‌ర్శించారు.


ఇక తాము అధికారంలోకి వచ్చాక‌ మా విద్యాశాఖలో మీరు పెట్టి వెళ్లిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ . 4271 కోట్లు. ఇవి విడతల వారీ చెల్లిస్తామని మాట ఇచ్చాను .. ఇప్పటికే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ . 788 కోట్లు విడుదల చేసిన మా ప్రభుత్వం తాజాగా రూ . 600 కోట్లు విడుదల చేసింది. త్వరలో మరో రూ . 400 కోట్లు విడుదల చేస్తాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా .. మీరు పెట్టిన బకాయిలు ఆర్థిక భారంగా మారినా, చివరి రూపాయి వరకూ బకాయిలు చెల్లించడం, విద్యార్థులు, తల్లిదండ్రుల పై ఎటువంటి ఒత్తిడి లేకుండా చేయడమే మా బాధ్యతగా భావిస్తున్నాం అని లోకేష్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: