
తమిళులు సైతం పవన్ కళ్యాణ్ పైన ఫైర్ అవుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు అన్ని అనుకూలిస్తే ఖచ్చితంగా తమిళనాడులో కూడా జనసేన పార్టీని విస్తరించేలా చేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. తాను ఏది కూడా ముందుగా ప్లాన్ చేసుకొని ఉండనని తమిళ ప్రజలు ఆ వారణాన్ని సృష్టిస్తే ఖచ్చితంగా అక్కడ జనసేన పార్టీ రంగంలోకి దిగుతుందంటూ తెలియజేశారు. అలాగే పొలిటికల్ తో పాటుగా సినిమాలలో కొనసాగుతూనే ఉంటారా అని ప్రశ్నించగా..
అందుకు పవన్ కళ్యాణ్ డబ్బులు అవసరం ఉన్నన్ని రోజులు తాను నటిస్తూ ఉంటాను అంటూ తెలియజేశారు. మరి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీతో చేతులు కలిపి అన్ని ప్రాంతాలలో కూడా తన కొనసాగించేలా చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఒక సభలో కూడా పవన్ కళ్యాణ్ తాను జాతీయస్థాయిలో రాజకీయాల్లో ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. మరి అందుకు అనుకున్నట్టుగానే ఇలా అడుగులు వేస్తున్నారేమో అన్నట్లుగా పలువురు అభిమానులు, కార్యకర్తలు తెలియజేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయినట్టుగా ఇతర ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అవుతారో లేదో చూడాలి మరి.