భారతీయ జనతా పార్టీ "బీ జే పీ" మూడవ సారి దేశంలో అధికారం లోకి వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే . మోదీ నేతృత్వంలో ప్రస్తుతం బి జె పి పార్టీ అద్భుతమైన దిశగా ముందుకు సాగుతుంది. ఇది ఇలా ఉంటే బి జె పి ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టిని పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం మరి ముఖ్యంగా తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టిని పెట్టింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం బి జె పి పార్టీకి తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో మంచి ఓటు బ్యాంకు దక్కుతూ వస్తుంది.

దానితో రాబోయే ఎన్నికలలో ఈ రెండు రాష్ట్రాలలో కూడా అద్భుతమైన అసెంబ్లీ , పార్లమెంటు స్థానాలను దక్కించుకోవాలి అని బి జె పి గట్టి ప్రయత్నాలను కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బి జె పి రాష్ట్ర అధ్యక్షురాలుగా పురందరేశ్వరి కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే కొంత కాలం క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలలో బి జె పి పార్టీ తెలుగుదేశం , జనసేన తో పాటు పొత్తులో భాగంగా పోటీ చేసింది. ఈ ఎన్నికలలో తెలుగుదేశం , జనసేన , బిజెపి కూటమికి అద్భుతమైన విజయం దక్కింది.

అలాగే బి జె పి కి కూడా అద్భుతమైన స్థానాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్కాయి. దానితో బి జె పి పార్టీ పురందరేశ్వరిని అద్భుతమైన స్థాయిలో నమ్ముతున్నట్లు తెలుస్తోంది. దానితో మరి కొంత కాలం పాటు పురంధరేశ్వరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బి జె పి అధ్యక్షురాలుగా కొనసాగించాలి అనే ఆలోచనలో బి జె పి పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: