ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలో ఉన్నప్పటికీ మూడు పార్టీలలో ప్రధాన పార్టీ టీడీపీ అనే సంగతి తెలిసిందే. అయితే ఏపీలోని టీడీపీ ఎంపీలలో 10 మంది ఎంపీలు బీజేపీలో చేరతారని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అంటే ఎంపీలు భయపడుతున్నారని అందుకే పార్టీ మారనున్నారని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. అయితే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
 
అయితే తెలుగుదేశం విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. బీజేపీ మిత్రపక్ష పార్టీలకు చెందిన ఎంపీలను తమ పార్టీలోకి తీసుకోవడానికి ఏ మాత్రం ఆసక్తి చూపదు. ఏపీలో బీజేపీకి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఆ పార్టీ టీడీపీతో కెరీర్ ను కొనసాగించాల్సిందేనని చెప్పవచ్చు.
 
టీడీపీ, జనసేన మద్దతు ఉంటే మాత్రమే ఏపీలో బీజేపీ సంచలనాలు సృష్టించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. మూడు పార్టీలు విడిపోతే మాత్రం ఈ మూడు పార్టీలు నష్టపోయి వైసీపీ లాభపడే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వైసీపీ భవిష్యత్తు ప్రణళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.
 
టీడీపీ సైతం తెలివిగా వ్యవహరిస్తుందని తమ పార్టీకి నష్టం చేకూరే విధంగా పార్టీ ఎలాంటి పనులు చేయదని చెప్పడంలో సందేహం అవసరం లేదు. టీడీపీ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. కూటమి త్వరలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ఇచ్చిన హామీలను అమలు చేస్తే 2029లో కూడా కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. చంద్రబాబు నాయుడు ఏపీ అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు లాంటి సీఎం దొరకడం ఏపీ ప్రజల అదృష్టం అని చెప్పడంలో సందేహం అయితే అవసరం లేదు.






మరింత సమాచారం తెలుసుకోండి: