కల్వకుంట్ల తారక రామారావు... ఏపీలో ఓడిపోయిన వైసీపీ పార్టీని ఫాలో అవుతున్నాడు. అక్కడ ఏపీలో చెప్పే డైలాగులను తెలంగాణలో  విసురుతున్నాడు కేటీఆర్. తాజాగా.. కరీంనగర్ గడ్డపై... ఇటీవల వైయస్ జగన్మోహన్ రెడ్డి విసిరిన డైలాగును కేటీఆర్.. తన నోట వినిపించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలకు అలాగే అధికారులకు వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్.  గులాబీ పార్టీ నేతలు, అలాగే కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన అధికారులను ఎవరిని కూడా వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు.

 తమ గులాబీ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టే  పోలీసుల పేర్లు రాసుకొని... పెట్టుకుంటున్నామని తెలిపాడు. ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదు.. దేశం దాటిన రప్పించి మరి ఆ పోలీసులకు శిక్షలు వేస్తామంటూ... కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు రిటైర్మెంట్ అయినా కూడా వాళ్లను... వదిలిపెట్టబోమని కూడా హెచ్చరించారు. సప్త సముద్రాలు దాటినా కూడా... ఆ అధికారులను తెలంగాణకు తీసుకువచ్చి... ఏం చేయాలో అది చేస్తామని... స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

 దీంతో పోలీసులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇటీవల... కాలంలో ఏపీలో కూడా వైసిపి కార్యకర్తలు అలాగే నేతలను టార్గెట్ చేసింది కూటమి సర్కారు. ఒక్కొక్కరిని జైలుకు పంపిస్తోంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం.  ఈ తరుణంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై స్పందించారు. వైసిపి నేతలను వేధిస్తున్న అధికారుల ను వదలను.. అంటూ హెచ్చరించాడు.

 వాళ్లందరినీ ఏపీకి తీసుకువచ్చి కఠిన శిక్షలు వేస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చాడు. వైసీపీ ప్రభుత్వం రాగానే వాళ్లందరికీ.. టార్చర్ చూపిస్తానని తెలిపాడు. వైసీపీ ప్రభుత్వం రాగానే ఏపీ నీ వదిలి... వేరే దేశాలకు వెళ్ళినా కూడా తీసుకువస్తామని తెలిపాడు. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా... వెతికి వేటాడుతామని హెచ్చరించాడు జగన్. దీంతో కేటీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ ఒకే తరహాలో ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: