పల్లెలు పట్టణీకరణ దిశగా కొనసాగుతున్నాయి .. పల్లెలను పారిశుద్ధ్య కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు అవగాహన ఎంతో పెరుగుతుంది .. అందులోనూ చెత్త సేకరణ అన్నది కీలక భూమిక పోషిస్తుంది . చెత్తను ఇష్టసారంగా పడేస్తే పారిశుద్ధ్యం అన్నదే కనబడదు ఇదే విషయాన్ని చాలా కాలం క్రితమే చెప్పిన జెసి .. తాడిపత్రిలో చెత్త సేకరణను ఆయన ఓ ఉద్యమంల మొదలుపెట్టారు చెత్త సేకరణ తో పాటు మున్సిపల్ చట్టాలను కూడా పక్కాగా అమలు చేస్తూ వస్తున్నారు . అలాగే తాడిపత్రిని అభివృద్ధి బాటలో నడిపే దిశగా ఆయన కీలక ప్రణాళికలకు చర్యలకు శ్రీకారం చుట్టారు .. అందులో చెత్త ఎక్కడపడితే అక్కడ పడేసే వారిపై ఫైన్లు వేస్తామంటూ కూడా ఆయన గతంలో పలు కండిషన్లు కూడా పెట్టారు. .
అయితే ఇప్పుడు తాజాగా రఘు రామకృష్ణంరాజు కూడా తన నియోజకవర్గం ఉండి పరిధిలో ఇదే తరహాలో ఓ కొత్త నిబంధనను అమలు చేయడానికి రెడీ అవుతున్నారు . వచ్చే ఉగాది నుంచి చెత్తను చెత్త సేహరించే వాహనాల్లో కాకుండా పంట కాలువలో పడేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన చెప్పారు .. తన మాటను ధిక్కరించి చెత్తని పంట కలంలో పడేసే వారిపై వెయ్యి రూపాయలు జరిమానాలను విధిస్తామని ఆయన హెచ్చరించారు .. ఇలా ఫైలు ద్వారా వచ్చే నిధులతో కెనాల్ డెవలప్మెంట్ ఫండ్ పేరిట ఓ నిధిని కూడా ఏర్పాటు చేసి ఆ నిధులతో పంట కాలులను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తామని ఆయన చెప్పుకొచ్చారు .. తన నియోజకవర్గంలో ఉన్న ఏ ఒక్కరు కూడా పంట కాలవల్లో చెత్తను వేసి ఈ జరిమానాలను కట్టాలని తాను ఎప్పుడు కోరుకోవటం లేదు .. మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే నా భావన అంటూ ఈ నిబంధన పెడుతున్నట్టు ఆయన చెప్పకు వచ్చాడు .