సాధారణంగా ఏదైనా దొంగతనం జరిగిన, ఏదైనా సమస్య ఉంటే కచ్చితంగా ప్రజలు పోలీసులను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే మరి పోలీస్ స్టేషన్ లోనే చోరీ జరిగితే ఇక ఆ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.. ఇది ఏపీలో ఇప్పుడు వైరల్ గా మారుతున్నది. తాజాగా గాజువాక పోలీస్ స్టేషన్లో ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏర్పడింది.రోడ్డు యాక్సిడెంట్ కేస్ కు సంబంధించి ఒక బుల్లెట్ బైక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంచిన ఈ బుల్లెట్ బైక్ మాయమైపోయిందట. దీంతో అటు పోలీసులు, ఓనర్ కూడా ఆశ్చర్యపోతున్నారు.



పూర్తి వివరాల్లోకి వెళితే.. సాధారణంగా ఏదైనా కేసులలో టూ వీలర్ వంటివి పట్టుబడితే గాజువాక పోలీస్ స్టేషన్ లోని ఉంచేవారట. ఇందులో భాగంగా గత ఏడాది మే - 3 వ తేదీన గాజువాక ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరగగా ఆ కేసుకు సంబంధించి ఒక బుల్లెట్ బైక్ ని పోలీసు అధికారులు సీజ్ చేశారట. ఆ బైకు ని పోలీసులు తమ స్టేషన్లోని ఉంచారు. హరీష్ అనే యజమాని బుల్లెట్ బైక్ని ముఖేష్ అనే వ్యక్తికి ఇచ్చారట. దీంతో ముఖేష్ రోడ్డు ప్రమాదంలో చిక్కుకోవడంతో హరీష్ బైక్ పైన కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసి మరి స్టేషన్లో ఉంచారట.

కానీ బండి యజమాని హరీష్ కోర్టు నుంచి అనుమతి తీసుకొని మరి వాహనం తీసుకోవడానికి స్టేషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ వాహనం ఇవ్వాలని పోలీసులను  అడగగా బండి ఇచ్చేందుకు సిద్ధమైన పోలీసులు దానిని పార్కింగ్ చేసిన చోటకు వెళ్లి చూడగా ఒక్కసారిగా ఆ బైక్ కనిపించకపోవడంతో అందరూ షాక్ కి గురయ్యారు. దీంతో వెంటనే సిఐ కోటేశ్వరరావు క్రైమ్ పోలీసులకు సరిత ఫిర్యాదు చేయగా.. మరొక కేసు కూడా బయటపడిందట.అక్కడ ఒక స్కూటీ కూడా కనిపించకుండా మాయమైనట్లు పోలీసులు గుర్తించారు.. దీంతో ఇలా బైకులు కొట్టేస్తోంది ఇంటి దొంగల పనేనా లేకపోతే మరెవరైనా బయట వ్యక్తులు కొట్టేస్తున్నారా? అనే విషయం పోలీస్ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.. పోలీస్ స్టేషన్లోని బైక్లు మాయం అవ్వడం ఇప్పుడు ఏపీ అంతట కలకలని సృష్టిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: