
ఇక 2024 ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయం ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది .. జగన్ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితం కావడం తో ఆ పార్టీలోని ముఖ్య నేతలు కూటమి పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు .. విజయసాయి రెడ్డి లాంటి కీలక నేతలు సైతం పార్టీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకున్నారు .. ఇక కార్పొరేషన్లు , మున్సిపాలిటీ ల్లో పాగా వేసేందుకు కూటమి పార్టీలు రాజకీయం మొదలుపెట్టింది .. ఇప్పటికే వచ్చే ఎన్నికల నాటికి వైసిపిని బలహీనపరిచే లక్ష్యంతో చంద్రబాబు , పవన్ కళ్యాణ్ తమ వ్యూహాలు అమలు చేస్తున్నారు .. అయితే ఇదే క్రమంలో జగన్ జిల్లాల పర్యటనకు రెడీ అవుతున్నారు . అలాగే పార్టీ క్యాడర్ ప్రజలకు అందుబాటులో ఉండాలని కీలక నిర్ణయం తీసుకున్నారు .. ఇందుకోసం తాడేపల్లి నివాసంలో ప్రజాదర్బార్ నిర్వహించేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.
అయితే మరోపక్క టిడిపి నేతలు కూటమి వచ్చే ఎన్నికల్లోను ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు . తమ మిత్రపక్ష పార్టీలతో సమన్మయంతో పని చేయాలని వారు సూచిస్తున్నారు .. అయితే ఇప్పుడు టిడిపి నాయకత్వం మరో సంచల నిర్ణయం తీసుకుంది .. మే నెలలో టిడిపి మహానాడు ఇసారి కడపలో నిర్వహించాలని తాజాగా జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు .. కాగా పులివెందులలో నిర్వహించేలా కడప జిల్లా టిడిపి నేతలు వారి ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తుంది . జగన్ ప్రాతనిధ్యం వహిస్తున్న పులివెందుల వేదికగా తమ సత్తా చూపాలని టిడిపి నేతలు భావిస్తున్నారు .. ఇక 2024 ఎన్నికల్లో కడప జిల్లాలో అనూహ పలితాలు సాధించిన టిడిపి తమ పట్టు కొనసాగించాలని చూస్తుంది .. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా నిర్వహిస్తున్న మహానాడు పులివెందులలో నిర్వహించే ఆలోచనకు వచ్చింది .
ఇక ఈ మహానాడు వేదికగా పార్టీ భవిష్యత్తు ప్రణాళికను చంద్రబాబు ముఖ్య నాయకులతో ఖరారు చేయనున్నారు .. అలాగే మహానాడు సమయానికి కూటమి ప్రభుత్వం దాదాపు ఏడాది పాలన పూర్తి చేసుకుంటుంది .. ఇక దీంతో రాజకీయంగాను బలం పెరిగేలా కీలక నిర్ణయాలు ఉండాలని చంద్రబాబు అనుకుంటున్నారు .. ఇక ఈ పులివెందుల మహానాడు ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించి విజయం చేయటం ద్వారా కేడర్‌లో మరింత జోష్ పెరగటం ఖాయమని టిడిపి నాయకత్వం అంచన వేస్తుంది .. అయితే ఇదే క్రమంలో జగన్‌ను రాజకీయంగా మరింత అనగా తొక్కావచ్చని కూడా భావిస్తున్నారు .. మహానాడు సమయానికి పార్టీ అంతా పులివెందులలోనే ఉండటం ద్వారా రాయలసీమలోను పార్టీకి మరింత కలిసి వస్తుందని అంటున్నారు . అయితే ఈ నిర్ణయం ద్వారా వైసీపీ జగన్ పై ఎలాంటి ప్రభావం ఉంటుంది .. టిడిపికి ఎంతవరకు రాజకీయంగా కలిసి వస్తుంది అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత ఆసక్తిగా మారింది.