
డి లిమిటేషన్ లో సౌత్ ప్రభావం తగ్గుతుంది అన్న చర్చలు .. ఆందోళనలు కొద్ది రోజుల నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక సౌత్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ , మహారాష్ట్ర , తమిళనాడు , కర్ణాటక పెద్ద రాష్ట్రాలు గా ఉండేవి. ఇక ఆంధ్ర రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. ఇక కాంగ్రెస్ అతి పెద్దదైన ఉత్తరప్రదేశ్ నీ విడదీయ్యకుండా అతి పెద్ద తప్పు చేసింది ఇప్పుడు బీజేపీ బలం ఉత్తర ప్రదేశ్. ఆ రోజు ఉత్తర ప్రదేశ్‌ను కూడా కాంగ్రెస్ రెండు, మూడు ముక్కలుగా చేసి ఉంటే ఈ రోజు బీజేపీ అక్కడ అంత బలం ఉండేదే కాదు.. ఇప్పుడు కాంగ్రెస్ ఇటు సౌత్‌లో పట్టు లేక అటు నార్త్‌లో పట్టు లేక విలవిల్లాడుతోంది.
ఇక బిహార్ తో పాటు ఉత్తర ప్రదేశ్ , మధ్యప్రదేశ్ లో కూడా బీజేపీ కొట్టుకుంటే చాలు సెంట్రల్ లో బీజేపీ కి అధికారం ఖాయం అవుతుంది. ఈ లెక్కన చూస్తే బీజేపీ ఇప్పట్లో కేంద్రంలో ఓడిపోదు మమత - కేజ్రీవాల్ - నితీష్ - స్టాలిన్ - కేసీఆర్ - అఖిలేష్ లాంటి వాళ్ళని నమ్ముకొని కాంగ్రెస్ సగం పుట్టమునిగి నట్లయ్యింది. కాంగ్రెస్ ఇక ఎప్పటికి కొన్ని రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకునే స్థాయిలో ఉండి పోయేలా ఉంది.
ఇక కాంగ్రెస్ నేరుగా బీజేపీ తో పోటీ పడే స్టేట్ లు తగ్గిపోయి .. కేవలం ప్రాంతీయ పార్టీ లు ఇచ్చే 10 సీట్ల లో పోటీ చేసే స్థాయి కి కాంగ్రెస్ పడిపోయింది. ఇక డీ లిమిటేషన్ కొత్త జనాభా లెక్కల ప్రకారం చేపడితే రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రా, తెలంగాణ లో కూడా లోక్‌సభ నియోజకవర్గాలు పెరగవు. అప్పుడు రెండు రాష్ట్రాలకు రాజకీయంగా పెద్ద ఎదురు దెబ్బ తప్పదు.